దామరగిద్ద : బాల్య వివాహాలు (Child marriage) చట్టరీత్య నేరమని మహిళా సాధికారత కేంద్రం అధికారి నరసింహ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దామరగిద్ద మండలంలోని క్యాతన్ పల్లి గ్రామంలో మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్యవివాహాల చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు దాటిన తరువాత వివాహాలకు అర్హులని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు జరుపడం సరికాదని అన్నారు. అమ్మాయిలను రక్షిద్దాం.. అమ్మాయిలను చదివిద్దాం అనే లక్ష్యంతో చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పిల్లల రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్ ( Toll free ) 1098ను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.
గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఉపయెగించుకోవాలని, ఒక జాబ్ కార్డ్ మీద వంద రోజులు పుర్తి అయిన వారి కుటుంబంలో వారికి ఉచితం గా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయని వివరించారు. చైల్డ్ లైన్ సంస్థ అధికారి అనిత మాట్లాడుతూ పిల్లలను బాల కార్మికులుగా కాకుండా విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు ప్రభుత్వ పథకాలు సుకన్య సంవృద్ధి యెజన, మిషన్ వాత్సల్య, లేబర్ కార్డ్ గురించి ఆమె వివరించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అస్టింట్ అంజప్ప , ఉపాధి కూలీలు పాల్గొన్నారు.