దామరగిద్ద, ఫిబ్రవరి 11 : మండలకేంద్రంలో చిరుత సం చరిస్తుండదనే అనుమానంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. మండల కేంద్రానికి చెందిన గడ్డమీది అంజప్ప రోజు మాదిరిగానే శనివారం తన పొలం వద్ద ఆవు, దూడను కట్టేసి ఇంటికొచ్చాడు. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లే సరికి దూడను ఏదో గుర్తు తెలియని జంతువు తిన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు.
ఏఎస్సై అరుణ్ ఇచ్చిన సమాచా రం మేరకు అటవీశాఖ అధికారి లక్ష్మణ్ అక్కడికి వచ్చి అనుమానిత ప్రదేశాన్ని పరిశీలించారు. అడుగుజాడల నమూనాలను సేకరించి పరిశీలకు పంపించామని, 15 రోజుల తర్వాత పూర్తి స మాచారం ఇస్తామని చెప్పారు. దూడలను కొన్ని రోజుల వరకు ఇంటి వద్దే ఉంచుకోవాలని, రైతులు పొలానికి వెళ్లేటప్పుడు ఆత్మరక్షణ కోసం చేతికర్రను తీసుకెళ్లాలని సూచించారు.