ఊట్కూర్, డిసెంబర్ 13 : కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి ప శువులను సంరక్షించుకునేందుకు వి ధిగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి శ్రీనివాసు లు రైతులకు సూచించారు. మండలంలోని పులిమామిడిలో మంగళవా రం ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరా న్ని ప్రారంభించారు. పాడి పశువుల పై రైతులు తగిన జాగ్రత్తలు వహించాలని, అధిక పాల దిగుబడికి మేత తోపాటు మిశ్రమ దాణా అదనంగా ఇవ్వాలని సూ చించారు. గర్భకోశ, ఎదకు రాని పశువులను పరిశీలించి తగు సూచనలు చేశారు. పశుసంవర్ధక అధికారులు తమకు కేటాయించిన గ్రామాలను క్ర మం తప్పకుండా వెళ్లి పశువులను పర్యవేక్షించాల ని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ సూరయ్యగౌడ్, వీఏఎస్ మహదేవ్, వెటర్నరీ అసిస్టెంట్లు కృష్ణశ్రీ, రాఘవరెడ్డి పాల్గొన్నారు.