తిమ్మాజిపేట : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములను (HCU lands ) కాపాడుకోవడం కోసం నిరంతరం పోరాడుతున్న విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని స్వేరో ( Swero Leaders ) రాష్ట్ర నాయకులు గిద్ద విజయ్ కుమార్( Vijay Kumar) డిమాండ్ చేశారు. నలంద యూనివర్సిటీకి ధీటుగా రాణిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను , ప్రొఫెసర్లు , సైంటిస్టులు, మేధావులను తీర్చి దిద్దిందని పేర్కొన్నారు.
చరిత్ర గల హెచ్‌సీయూకి చెందిన భూములను సీఎం రేవంత్ రెడ్డి కన్నేసి ఆ భూములను వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు నిర్మించడానికి తీసుకోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని విమరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు భూములను కొనుగోలు చేసి ప్రభుత్వ శాఖల భవనాలను నిర్మించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండడం శోచనీయమని అన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.