మూసాపేట(అడ్డాకుల): అడ్డాకుల మండలంలోని వర్నె, ముత్యాలంపల్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న వాగుపై వంతె న నిర్మించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్‌లో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులను కోరారు.
వర్నె వాగుపై ఐదు దఫా లుగా తాత్కాలికంగా మూడు దఫాలుగా మట్టి పైపులతో రోడ్డు వేసినా వరదకు కోట్టుకు పోయిందన్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఆ రెండు గ్రామాల ప్రజలు రోడ్డు కోట్టుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని, ఆ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే అదనంగా 30 కిలో మీటర్ల దూరం వెళ్లి తిరిగి రావాల్సి వస్తుందన్నారు.
కావున వెంటనే వర్నె, ముత్యాలంపల్లి వాగుపై శాశ్వత పరిష్కారం చుపుతూ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అదేవిధంగా చిన్నచింతకుంట మండలంలోని నెల్లికోండి, సీతారాంపేటకు వెళ్లే రోడ్డు మార్గంలో వంతెన, అడ్డా కుల మండలంలోని గౌరిదేవునిపల్లి, మూసాపేట మండలంలోని కోమిరెడ్డిపల్లి గ్రామల మధ్యలో ఉన్న పెద్దవాగులో వంతెన నిర్మాణాలకు నిధులు మంజురు చేయాలని కోరారు. నియోజకవర్గంలో బీటీ రోడ్లకు నిధులు మంజురు చేయాలని కోరారు.