మరికల్,మే 13 : మరికల్ మండలంలోని మాధవరం గ్రామంలో సోమవారం రాత్రి చిరుత దాడి చేయడంతో బర్రె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రైతు రవికి చెందిన బర్రె పొలం దగ్గర ఉండగా సోమవారం రాత్రి చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. బర్రె విలువ సుమారు 40 వేల రూపాయల వరకు ఉంటుందని రైతు ఆవేదన చెందారు.
చిరుత ఈ ప్రాంతంలో సంచరించి బర్లపై దాడి చేయడం ఇది నాలుగో సారి. ఈ విషయమై ఫారెస్ట్ బీట్ అధికారి మల్లేష్ ను వివరణ కోరగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గతంలోని గుర్తించామన్నారు. చిరుత దాడుల్లో మృతి చెందడంతో రైతులను ఆదుకుంటామని తెలిపారు. మాధవరం, పూసలపాడు గ్రామాల్లో వరుసగా దాడులు జరుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.