నారాయణపేట : గ్రూప్ – 1 పరీక్ష (Group-1 exam ) నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలమైనందును తమ పదవులకు వెంటనే .. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట సత్యనారాయణ చౌరస్తాలో బీఆర్ఎస్వీ నిరసన (BRSV protest ) నిర్వహించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ -1పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ ( BRSV) నారాయణపేట జిల్లా కోఆర్డినేటర్ శివరాజ్ రెడ్డి డిమాండ్ చేశారు.
జీవో నెం 29 రద్దు చేయాలని, జీవో నెం 55 ఇంప్లీమెంటేషన్ చేయాలని కోరారు. గ్రూప్ -1పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి, హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలన్నారు .
గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్, కమిషన్ అధికారులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోలు నరేష్, బాలు, శ్రీను, బాబు, సాయికృష్ణ, వినయ్ రెడ్డి, అనిల్, శ్రావణ్, ఇర్ఫాన్, కుర్వ నవీన్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.