గత ఐదేండ్ల కాలంలో మున్సిపాలిటీలను అభివృద్ధికి కృషి చేసిన బీఆర్ఎస్ మున్సిపల్ మాజీ చైర్మన్లు, చైర్పర్సన్లు, మాజీ వైస్ చైర్మన్లను బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ లోగోతో ఉన్న మెమెంటోలను వారికి అందజేశారు. కార్యక్రమంలో మాజీమంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌ డ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు విజయు డు, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తోపాటు పలువురు పాల్గొన్నారు.