మూసాపేట : ఈనెల 27న జరిగే వరంగల్ రజతోత్సవ (BRS silver jubilee) భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ ( BRS ) మండల అధ్యక్షుడు లక్ష్మినరసింహ యాదవ్, మాజీ జడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్ (Indraiah Sagar ) పిలుపునిచ్చారు.
సోమవారం మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట( Musapeta ) మండల స్థాయి సన్నాహక సమావేశం జానంపేట గ్రామంలో నిర్వ హించారు. వారు మాట్లాడుతూ ఈనెల 27న ఉదయం 8 గంటలకు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు కార్యక్రమాలను నిర్వహించి వరంగల్ సభకు బయలుదేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.