దామరగిద్ద : ఈ నెల 27న వరంగల్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ ( BRS Silver Jubilee ) సభకు జనాన్ని తరలించేందుకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని దామరగిద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గవినోల్ల సుభాష్ ( Subhash ) కోరారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ముఖ్య నాయకులతో మాట్లాడారు.
సభకు జనాన్ని తరలించేందుకు వాహనాలను ( Vehicles ) అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) నాయకత్వంలో జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండగా నేడు రేవంత్ పాలనలో దుర్భిక్షం తాండవిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బక్క నరసప్ప, మాజీ ఎంపీటీసీ కిషన్ రావు, నాయకులు వెంకటరెడ్డి, భీమయ్యగౌడ్ శెట్టి శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.