దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), నవంబర్ 14 : కౌకుంట్ల, చిన్నచింతకుంట మండల కేంద్రాలతోపాటు నెల్లికొండి, దమగ్నాపూర్, అల్లీపూర్, రాజోలి, ముచ్చింతల, పల్లమర్రితోపాటు పలు గ్రామాల్లో మంగళవారం కారు గుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దేవరకద్ర నియోజకవర్గాన్ని సాగునీటి కోసం నిర్మించిన కర్వెన ప్రాజెక్టు, చెక్‌డ్యాంలు, చింతకుంట వాగుపై నిర్మించిన వంతెన, ప్రతి గ్రామానికి బీటీరోడ్లు అలాగే సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భూత్పూర్, నవంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల ఆత్మగౌరవం బీఆర్ఎస్ ప్రభుత్వమే కాపాడిందని ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కప్పెటలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వృద్ధులను దివ్యాంగులను ఓటు బ్యాంక్‌గానే ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ వృద్ధులకు, దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో రానున్న రోజుల్లో ఏకంగా రూ.5 వేలకు పెంచానున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, రైతుబంధు మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, సర్పంచ్ వేణుగోపాలాచారి, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
దేవరకద్ర, నవంబర్ 14 : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ఉందని ఎంపీటీసీ తిరుపతయ్య, సర్పంచ్ శ్యాం సుందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మండల నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీన్గురాలలో ఎంపీటీసీ, సర్పంచ్ ఇంటింటి ప్రచారంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం సహాకరంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామా ల్లో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేశ్‌గౌడ్ పొల్గొన్నారు.
మదనాపురం, నవంబర్ 14 : బీఆర్ఎస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తరఫున మదనాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నా యకులు మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి కారుగుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ నారాయణ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు లబ్ది పొందిన కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, సర్పంచులు, ఎంపీటీసీ, నాయకులు పాల్గొన్నారు.