అలంపూర్, ఏప్రిల్ 19 : బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాం టి చిల్లర రాజకీయాలు బీజేపీకే చెల్లుతుందని గ్రం థాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బెక్కెం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. బుధవారం మీడియా మిత్రులను వెంట తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రఘునందన్‌రావు వాస్తవాలు తెలుసుకోవాల ని హితవు పలికారు. ఏదేదో ఊహించుకొని గిట్టనివారు చెప్పిన దానిని నమ్మి మంత్రిపై ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. మంత్రి ఎవరి భూమి ని కబ్జా చేయలేదని, రైతుల అభీష్టం మేరకే వారి వ ద్ద కొనుగోలు చేశాడన్నారు. 100 ఎకరాల్లోపు ఉన్న భూమిని 180 ఎకరాలు ఉందని, సగానికి సగం క బ్జా చేశారనే ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు. బీ జేపీ నాయకులు ఉనికి కాపాడుకునేందుకు, హైలెట్ అయ్యేందుకు పలుకుబడి ఉన్న వ్యక్తులు, పార్టీలు, మంత్రులపై అసత్య ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు.
కూలీలు, గోశాల, వ్యవసా య పనిముట్ల కోసం వేసిన రేకులషెడ్లు.. ఫాంహౌస్లాగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. సరిగ్గా కనిపించకుంటే ‘కంటివెలుగు’ శిబిరాలకు వెళ్లి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఎక్కడో కూర్చొని మా ట్లాడడం కాదు.. క్షేత్ర స్థాయిలో వచ్చి పరిశీలించాలన్నారు. అవసరమైతే వచ్చిపోయే ఖర్చులు కూడా మేమే భరిస్తామన్నా రు. మంత్రులపై లేనిపోని అభాండాలు మోపితే పరువు నష్టం దావా వేయవలసి వస్తుందని హె చ్చరించారు. మంత్రి ఖరీదు చేసిన భూములు కాకుండా.. ఒక్క గుంట ఎక్కువ చూపించి నా మొత్తం వదులుకోవడానికి సిద్ధంగా ఉ న్నామన్నారు. 180 ఎకరాలు మంత్రి కబ్జా లో ఉన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికైనా సిద్ధమేనన్నారు. లేకపోతే నీవు బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తావా అని రఘునందన్‌కు సవాల్ విసిరారు. కా గా, ‘మా భూములు ఎవరూ బలవంతంగా లాక్కోలేదు. ఇష్టప్రకారమే అమ్ముకున్నాం’ అని భూములు విక్రయించిన రైతులు తెలిపారు.