మహబూబ్‌నగర్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గెలుపుగుర్రాలకు ఆదివారం ప్రగతిభవన్‌లో బీ ఫారాలు అందజేశారు. అలంపూర్ అభ్యర్థికి మినహా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 11 మందికి బీ ఫారాలు పంపిణీ చేశారు. సిట్టింగులకే పట్టం కట్టడంతో పార్టీ శ్రేణులు, అభిమానుల్లో సంబురం నెలకొన్నది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ‘గులాబీ’ గుబాళించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్డ్ వచ్చే వరకే అభ్యర్థులంతా ఆయా నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేశారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో సందడి చేశారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన స్థానాల్లో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుతున్నది. ఎక్కడికక్కడ అసంతృప్తులు వెల్లువెత్తుతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక ‘కమలం’ చాటున పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. ఇప్పటివరకు చడీచప్పుడు లేకపోవడంతో క్యాడర్లో అయోమయం నెలకొన్నది. ‘కారు’ జోరును తట్టుకోలేక ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు గ్రామాల్లో విపక్షాల నాయకులు క్యూ కడుతుండడంతో వారిని నిలువరించలేక నానా తంటాలు పడుతున్నారు. కారు టాప్ గేర్ అందుకోవడంతో ముచ్చెమటలు పడుతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే అభ్యర్థులను ఖరారు చేసి దూకుడు మీద ఉన్న బీఆర్ఎస్.. అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ది. ఆదివారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో అభ్యర్థులకు బీఫారంలు అందజేశారు. గెలుపుగుర్రాలకు బీ ఫారాలు అందించడంతో ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఆ యా నియోజకవర్గాల్లో కార్యకర్తలు సం బురాలు చేసుకున్నారు. స్వీట్లు తినిపించుకొని.. గులాబీ రంగు చల్లుకొని డాన్సులు చేశారు. మం త్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితోపాటు సి ట్టింగ్ ఎమ్మెల్యేలైన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్ యాదవ్‌ల కు సీఎం కేసీఆర్ బీఫారాలు అందించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులతో చర్చలు జరి పి సమన్వయం చేశాక బీఫారం అందజేయనున్న ట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందరూ అనుకున్నట్లే సిట్టింగ్‌లకు టికెట్లు దక్కడంతోపాటు పార్టీ అధినేత బీ ఫారం అందించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవై పు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా 2018 సీన్ రిపీట్ చేస్తామని బీఆర్ఎస్ కార్యకర్తలు శపథం చేస్తున్నారు. మరోవైపు పార్టీలో వ లసల జోరు పెరుగుతున్నది. ఆ యా పార్టీల తీరుపై విసుగెత్తి ఎ న్నికలు సమీపిస్తున్న తరుణం లో కూడా కాంగ్రెస్, బీజేపీకి చెందిన నా యకులు ‘కారు’ ఎక్కుతున్నారు. కారు టాప్ గేరు అందుకోవడంతో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పడుతున్నాయి.
11 మందికి బీఫారాలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 ని యోజకవర్గాలకుగానూ 11 మంది అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫారా లు అందించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిల తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మహబూబ్‌నగర్ ని యోజకవర్గం నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి నుంచి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అచ్చంపేట నుంచి విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మక్తల్ నుంచి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, దే వరకద్ర నుంచి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్చర్ల నుంచి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నారాయణపేట నుంచి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, గద్వాల నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, నా గర్‌కర్నూల్ నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి జైపాల్యాదవ్లకు బీ ఫారాలు అందించారు. టికెట్లు ఖరారైన అభ్యర్థులు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఒక విడుత పర్యటించారు. షెడ్యూల్డ్ వచ్చేవరకే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో గ్రామాల్లో సందడి చేశారు.
కారు ఎక్కుతున్న క్యాడర్..
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో వారు నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి పర్యటనలు చేశారు. అ భ్యర్థులు తిరుగుతున్నా కాంగ్రెస్, బీజే పీ పార్టీలు ఇంకా టికెట్లను ఖరారు చేయకపోవడంతో చాలా మంది కిందిస్థాయి క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల వ్యవహారం చిలికిచిలికి గాలి వానలా మారింది. ఎవరికి టికెట్ ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇక బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు జంకే పరిస్థితి వచ్చింది. దీంతో కింది స్థాయి క్యాడర్ విసుగుచెంది గులాబీ కండువా కప్పుకొంటున్నారు. ఇంకా మిగిలిపోయిన సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారు. దీంతో వారిని పార్టీ లో నిలువరించలేక నానా తంటాలు ప డుతున్నారు.ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతిరో జూ నియోజకవర్గంలో పర్యటిస్తే కార్యకర్తలు చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల నాటికి ప్రతిపక్షాలు ఖాళీ అయ్యే విధంగా కనిపిస్తున్నది.మరోవైపు కాంగ్రెస్ టికెట్లు రాని ఆశావహులు కూడా ‘కారు’ఎక్కాలని చూస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు..
బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందించడంతో ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాల్చి.. స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల సంబురాలతో మిన్నంటిపోయాయి. కొన్నిచోట్ల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి గులాబీ జెండా పట్టుకొని డ్యాన్స్ చేశారు. కేసీఆర్ జిందాబాద్.. కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో బీ ఫారాలు అందుకున్న అభ్యర్థుల ఫొటోలను షేర్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థులకు భారీ మెజార్టీని కట్టబెడుతామంటూ మూకుమ్మడిగా చెబుతున్నారు.