ప్రశ్నిస్తే కేసులా..?
సమస్యల సాధనకు నిరసన తెలుపడం ప్రజాస్వామిక హక్కు. ఆ హక్కుల రక్షణ కోసం నిరసన గళం వినిపించడం ప్రజాస్వామ్యంలో భాగం. కానీ వీటిపై ఉక్కుపాదం మోపితే నియంతృతానికి దారితీస్తుం ది. ప్రసుత్తం రాష్ట్రంలో అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న దారితప్పిన విధానాలతో ప్రజల సంక్షేమానికి ముప్పు వాటిల్లుతోంది.
- నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు
- హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను నీరు గార్చే కుట్రపై ఉద్యమిస్తే నిర్బంధం
- నిప్పులు చెరుగుతున్న బీఆర్ఎస్ నేతలు, ప్రజాస్వామికవాదులు
- ఉవ్వెత్తున ఎగిసిన నిరసనతో కాంగ్రెస్ నేతలకు కండ్ల మంటని ఫైర్
- న్యాయబద్ధంగా పోరాటం : మర్రి
కల్వకుర్తి, ఆగస్టు 21 : సమస్యల సాధనకు నిరసన తెలుపడం ప్రజాస్వామిక హక్కు. ఆ హక్కుల రక్షణ కోసం నిరసన గళం వినిపించడం ప్రజాస్వామ్యంలో భాగం. కానీ వీటిపై ఉక్కుపాదం మోపితే నియంతృతానికి దారితీస్తుం ది. ప్రసుత్తం రాష్ట్రంలో అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న దారితప్పిన విధానాలతో ప్రజల సంక్షేమానికి ముప్పు వాటిల్లుతోంది. అలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాన రాజకీయపార్టీల నుంచి ప్రజాస్వామిక వాదుల వరకు వివిధ రకాలుగా నిరసనకు వ్యక్తం చేస్తారు. ఇది తప్పు అనే రీతిలో ప్రభుత్వం అక్రమ కేసులను బనాయించడంపై ప్రజాస్వామిక వా దులు మండిపడుతున్నారు. పేదింటి ఆడపిల్లలకు అండగా ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలన్న డిమాండ్‌తో గురువారం నాగర్‌కర్నూల్‌లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడంపై అధికార పార్టీ నేతల కనుసైగలతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
మర్రితో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ శ్రేణులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నీరుగార్చే యత్నం చేస్తుంటే పేదలకు అన్యాయం చేయొద్దని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారా? అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు మద్దతుగా ప్రజాస్వామిక వాదులు ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
గులాబీ పార్టీ శ్రేణులపై కేసులు నిత్యకృత్యంగా మారిన వైనం
ప్రశ్న గొంతు నొక్కితే.. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్న, నిరసన ఒకే నాణేనికి రెండు మొఖాలు. పాలనలో గాడి తప్పిన ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చేందుకు నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై కేసులు నిత్యకృత్యమే పోయాయి. మక్కలు కొనుగోలు చేయాలని, తరుగు లేకుండా వడ్లు సేకరించాలనే డిమాండ్‌తో వంగూర్‌లో రైతు ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులపై, కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై కల్వకుర్తిలో నిరసన తెలిపిన 23 మంది బీఆర్ఎస్ నాయకులపై, కోడేరు మండలం నర్సాయిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అంశమై 12 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని ధర్నా నిర్వహించిన మర్రితోపాటు మరో 38 మంది కేసుల పేరుతో నిర్బంధించాలని చూస్తున్నారు.
కాంగ్రెసోళ్లు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన తెలిపిన ఘటనలు చాలానే ఉన్నాయి. జూలై 22న నాగర్‌కర్నూల్‌లో బీజేపీకి వ్యతిరేకంగా హస్తం పార్టీ నేతలు ధర్నా చేపట్టి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలో పలు చోట్ల కొనసాగగా.. ఎమ్మెల్యేలు పాల్గొన్న ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు నిబంధనలు ఉల్లఘించారని, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని. ఎంత మంది కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల రక్షణ వలయంలో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయలేదా? అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల పక్షాన నిరసన తెలుపడంలో న్యాయం ఉందా? లేదా? అనే కోణంలోనే పోలీసులు ఆలోచించాలి. కానీ అధికార పార్టీ కనుసన్నల్లో కాదని ప్రజాస్వామిక వాదులు మండిపడ్తున్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తే సంసారం.. తాము చేస్తే మరోకటా అంటూ బీఆర్ఎస్ భగ్గుమంటున్నది.
కందనూల్లో నిరసన హోరు కల్యాణలక్ష్మి, షాదీము
బారక్ పథకాల ను సంబంధిం చి ప్రభు త్వం కౌంట ర్ దాఖలు చేయకపోవడం వల్లనే వీటికి బ్రేక్ పడిందని, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరంగా ఉన్న ఈ పథకాలను కొనసాగించాలనే డిమాండ్‌తో నాగర్‌కర్నూల్‌లో మాజీ ఎమ్మెల్యే మర్రి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గళాన్ని వినిపించి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించుకుతినే పాలన అంటూ దుమ్మెత్తిపోశారు. నమ్మి ఓట్లేస్తే నట్లేట ముంచుతున్నారని శాపనార్థాలు పెట్టారు.
ఇది చూసి ఓర్వలేని అధికార పార్టీ కేసులు పెట్టి తమ అహాన్ని చల్లార్చుకుందని ప్రజాస్వామిక వాదులు సెటైర్లు విసురుతున్నారు. కాగా కందనూల్లో నిరసన చేపడుతున్నట్లు మర్రి ప్రకటనతో రెండు, మూడ్రోజులుగా సోషల్, మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. పెద్ద ఎత్తున చేపడుతున్న క్రమంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది మరిచి ప్రజా జీవనానికి ఆటంకం కలిగించారని, పోలీసు విధులను అడ్డుకున్నారని కేసులు నమోదు చేయడం దుర్మార్గమని మానవతావాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతి లేకుండా ధర్నా చేశారంటూ..
నాగర్‌కర్నూల్, ఆగస్టు 21 : కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం శాంతియుతంగా నిరసన తెలుపగా అనుమతి లేకుండా ధర్నా చేశారంటూ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు 38 మంది నాయకులు, కార్యకర్తలపై నాగర్‌కర్నూల్ పోలీసులు కేసులు బనాయించారు. గాంధీ పార్కు వద్ద కొందరు గుమిగూడి అక్కడి నుంచి రోడ్డుపైకి వచ్చి ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ దవాఖాన ఎదుట ప్ర ధాన రహదారి కూడలిలో ధర్నా చేశారని, రహదారిని దిగ్భంధించి ప్రజా రవాణాకు, ప్రజలకు ఆటంకం కలిగించారని మర్రితోపాటు మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, కొత్త గంగాధర్, తిమ్మాజిపేట పాండు,
మాజీ ఎమ్మెల్యే పీఏ నర్సి ంహ, బీఆర్ఎస్వీ నాయకుడు అతినారపు విష్ణు, బొల్లారం వెంకట్రాములు, ఇమ్మడిశెట్టి నగేశ్, ఖానాపురం ముఖేశ్, దేవేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, బాబురావు, కరణ్‌లాల్, ప్రదీప్‌కుమార్, శశికాంత్, పాలమూ రి ప్రసాద్, జలీల్‌ఖాన్, భాస్కర్‌గౌడ్, అమరేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మ న్ వెంకటయ్య, రాజుగౌడ్, కిశోర్‌గౌడ్, వంశీగౌడ్, బంగారయ్య, గోపీగౌడ్, కేశవులుగౌడ్, మహేశ్, ప్ర మోద్, లింగారెడ్డి, హనుమంత్‌రావు, కౌన్సిలర్ జయప్రకాశ్‌చారి, శరబంద, మహమూద్, మంగి విజయ్, పరశురాములు, షఫీఉల్లాఖాన్, మహేష్‌లపై స్థానిక ఎస్సై వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని చేపట్టిన నిరసనకు మహిళలు, ప్రజలు సహకరించడంతో సక్సెస్ అయ్యిందన్న ఉద్దేశంతో స్థానిక పోలీస్ కానిస్టేబుల్‌తో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
ప్రశ్నించడం నా ప్రజాస్వామిక హక్కు..
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రజలకు అండగా వారితో కలిసి ప్రభుత్వ ఆగడాలపై నిరసన తెలుపుతూనే ఉంటాను. పథకాల అమలు కోసం ఎలుగెత్తి నినదిస్తాను. పేదలకు అన్యాయం జరిగితే ఎదురు తిరుగుతా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రభుత్వ అసమర్థతో నిలిచిపోయే పరిస్థితి దాపురించింది. ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వం తొక్కేయాలనుకుంటుంది. అందుకే ప్రజాస్వామ్య బద్ధంగానే నిరసన తెలియజేశాం. తప్పును సరిచేసుకోలేని సర్కార్ తమపై అక్కసుతో కేసులు నమోదు చేసింది. కేసులకు భయపడం. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. న్యాయబద్ధంగా పోరాడుతాం. ప్రజల పక్షాన పోరాటం మాత్రం ఆపం. అధికారం వస్తుంది.. పోతుంది.. ప్రజలు మాత్రం శాశ్వతం. వారి పక్షానే ఉంటాను. పోరాడుతూనే ఉంటాను. కేసులు పెడితే మరింత శక్తిని పుంజుకుంటూనే ఉంటా. ప్రజలే నా బలం.. చివరి శ్వాస వరకు ప్రజలతోనే ఉంటా.
– మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

