వనపర్తి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : చిన్నంబావి మండలం లక్ష్మీపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి మూడు నెలలు అవుతున్నది. అయినా, ఇప్పటివరకు హంతకుల జాడ లేకపోవడంతో అందరి దృష్టి పోలీసులపై పడింది. రాష్ట్రస్థాయిలో రా జకీయ హత్యగా చర్చకు దారితీసిన ఈ ఘ టన పోలీసులకు సవాల్‌గా మారింది.
కేసు కొలిక్కి రానందునా హంతకులను ఎప్పు డు పట్టుకుంటారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లక్ష్మీపల్లికి చెందిన శ్రీధర్‌రెడ్డి మే 22వ తేదీన అర్ధరాత్రి ఇంటిపక్కన కల్లంలో నిద్రిస్తుండగా హత్యకు గురైన సంగతి విధితమే. హత్య జరిగి 90రోజులు గడుస్తున్నప్పటికీ విచారణలో ఎలాంటి పురోగతి లేదు. ముందుగా వనపర్తి సీఐ నాగభూషణం ఆధ్వర్యంలో కొంతకాలం విచారణ కొనసాగింది. హంతకులను పట్టుకోవాలని ఒత్తిడి ఉన్నప్పటికీ కేసులో పోలీసులకు ఆశించిన పట్టు దొరకలేదు. కుటుంబ సభ్యులు ఇది రాజకీయ హత్య ముక్తకంఠంగా పోలీసులకు చెబుతూ వచ్చారు.
రాష్ట్రస్థాయిలో ఈ ఘటన అప్పట్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 50మంది వరకు పోలీసులు విచారణ చేసినట్లు అనధికార సమాచారం. స్నేహితులు, రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలు, ఆర్థికపరమైన సంబంధాలు, రాజకీయ ప్రత్యర్థులు, ఇతర అనుమానిత వ్యక్తులతో ఉన్న సంబంధాలపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు పకడ్బందీగా వ్యవరించడంతో పోలీసులకు దర్యాప్తులో ముచ్చెమటలు పడుతున్నాయి.
శ్రీధర్‌రెడ్డి హత్య ఘటనలో నిందితులను పట్టుకోవడంలో ఆలస్యమైందన్న ఒత్తిడితో మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ జూలై 17న లక్ష్మీపల్లి గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబంతో మాట్లాడారు. విచారణ వేగవంతానికి ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐల సమక్షంలో ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చిన్నంబావి పోలీస్‌స్టేషన్‌లో ఐజీ వెల్లడించారు.
ఐజీ వచ్చి వెళ్లి 35 రోజు లు గడుస్తున్నా, ప్రత్యేక బృందం పలు కోణాల్లో వి చారణ చేపట్టినా నిందితుల జాడ మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్లి బా ధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చె ప్పారు. నిందితులను పట్టుకోవడంలో ఇంకా ఆలస్యమైతే రాష్ట్ర పోలీసు అధికారి కార్యాలయం ఎ దుట ఆందోళన చేస్తామని ప్రకటించారు. కాగా, బా ధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాల ని హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర పోలీసు అధికారులకు వి న్నవించుకున్నారు.
శ్రీధర్‌రెడ్డి హత్య కేసు ను త్వరలోనే ఛేదిస్తాం. ఐ జీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తు న్నాం. ఎక్కడా శాఖాపరమైన నిర్లక్ష్యం లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తు న్నాం. హంతకులను ప ట్టుకుంటాం. కొత్త, పాత అనుమానితులందరినీ విచారణ చేస్తున్నాం. వీలైనంత త్వరగా కేసులో పురోగతి సాధిస్తాం.
– రావుల గిరిధర్, ఎస్పీ, వనపర్తి జిల్లా