బాలానగర్(రాజాపూర్)/పాన్‌గల్, పెద్ద మందడి, సెప్టెంబర్ 22 : మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యాయి. బాలానగర్ ఎస్సై లెనిన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండ లం వెల్టూరుకు చెందిన హారిక (23)కు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వ చ్చింది.
ఆదివారం పెద్దల అమావాస్య కావడంతో పానగల్ మండలం, చిక్కేపల్లికి చెంది న హారిక బావ బీరం రంజిత్‌కుమార్‌రెడ్డి (39), ఆయన భార్య చైతన్య పెద్దమందడి మండలం వెల్టూరుకు వచ్చి పెద్దల పండుగను జరుపుకొన్నారు.
ఉద్యోగంలో చేరేందుకు బెం గళూరుకు వెళ్తున్న మరదలు హారికను విమానం ఎక్కించేందుకు సోమవారం తెల్లవారుజామున రంజిత్‌కుమార్‌రెడ్డి ఆమెను కారులో ఎక్కించుకొని విమానాశ్రయానికి బయలుదేరారు.
ఉదయం రాజాపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో వెళ్తుండగా హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు వెళ్తున్న ఓ కారు ముందు వెళ్తున్న లారీని అధిగమించే ప్రయత్నంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. అదే వేగం తో విమానాశ్రయానికి వెళ్తున్న వీరి కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వం సం కాగా.. కారులో ప్రయాణిస్తున్న రంజిత్‌కుమార్‌రెడ్డి, ఆయన మరదలు హారిక అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించారు. మృతదేహాలను జడ్చర్ల దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. రంజిత్కుమార్రెడ్డికి రెండేళ్ల బాబు, గర్భిణి అయిన భార్య చైతన్య ఉన్నా రు. బావ మరదళ్ల మృతితో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం అలుముకుంది.