వనపర్తి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : తాగునీ టి ఎద్దడి నివారణకు అవసరమైతే రైతుల బోర్లను లీ జుకు తీసుకుంటామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు చిన్నారెడ్డి పేర్కొన్నారు. కరువు దృష్ట్యా ఇంటింటికీ సరఫరా అవుతున్న నల్లా నీటిని పొదుపుగా వాడుకోవాలని, అప్పుడే నీటిఎద్దడి నుంచి బయటపడే అవకా శం ఉందన్నారు. వనపర్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా వేసవిలో నీటి సరఫరాపై శుక్రవారం విలేకరులతో సమావేశమై మాట్లాడా రు. ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా నీటి సరఫరా అవుతున్నదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి నీటి వృ థాను అరికట్టాలని, నీరు పట్టుకున్నాక కుళాయి బంద్ చేయాలన్నారు. అలా కాకుండా బాత్రూంలో, మురికి కాల్వల్లోకి నల్లా పైపును వేయడం వల్ల నీరు వృథా అవుతుందన్నారు. వాహనాలు, ఇండ్ల శుభ్రం పేరుతో నీ టిని దుర్వినియోగం చేయరాదని కోరారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న నీటి డిమాండ్, సరఫరా అవుతున్న వివరాలను వెల్లడించారు. అత్యధికంగా నీటి సమస్య ఉన్న గ్రామాల్లో బోర్లను లీజుకు తీసుకునేలా కలెక్టర్లకు ప్రభు త్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించేందుకు కూడా ఇబ్బంది లేదని, నీటి ఎద్దడి నివారణకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. సమావేశంలో నా యకులు కిరణ్‌కుమార్, ఖమ్మర్ మియా, యాదయ్య, వేణు, రాములు, బాబా, జాను పాల్గొన్నారు.