ఊట్కూర్, ఫిబ్రవరి 5 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జీవో 69 ద్వారా సీఎం సొంత జిల్లాలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులపై రైతుల నుంచి నిరసనలు వె ల్లువెత్తున్నాయి. మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూర్ రి జర్వాయర్ నుంచి ఊట్కూర్ పెద్ద చెరువు, పేరపళ్ల జయ మ్మ చెరువు నుంచి సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌కు 7 టీఎంసీల సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు మొదటి ఫేజ్ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ నిర్మాణ పనులను ఊట్కూర్ మండలంలోని తిప్రాస్‌పల్లి, బాపురం శివారు రైతులు అడ్డుకొని నిరసనను వ్య క్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో పలుమార్లు హెలిక్యాప్టర్ ద్వారా లైడర్ సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఓపెన్ కెనాల్, పంప్ హౌజ్, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం తాజాగా ఊట్కూర్, బాపురం, తిప్రాస్‌పల్లి గ్రామాల శివారులో భూ సేకరణ కోసం సర్వే చేపట్టింది.
వారం రోజుల నుంచి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు భూ సేకరణ కో సం సర్వే చేపట్టారు. సర్వే విషయాన్ని ఇటు ప్రభుత్వం, అటు మెగా ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధుల నుంచి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గోప్యంగా సర్వే నిర్వహిస్తుండటంతో శివారు రైతులు అధికారులను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం బాపురం శివారులోని సర్వే నెంబర్ 25,26లో పంప్‌హౌజ్ నిర్మాణం కోసం అధికారులు దగ్గురుండి చేపట్టిన మట్టి నమూనా పరిక్షలను రైతులు అడ్డుకున్నారు. తమ పొలాల్లో దొంగచాటున సర్వే పనులు చేపడితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. ఇదే క్రమంలో రైతులను సముదాయించేందుకు పో లీసు బలగంతో వచ్చిన తాసీల్దార్ చింత రవిని సైతం రై తులు నిలదీశారు. తమ భూముల్లో సర్వే చేపట్టడం తగదని హెచ్చరించారు.
భూములిచ్చే ప్రసక్తే లేదు..
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,200 కోట్ల టెండర్ ప్రక్రియతో మెగా ఇంజినీరింగ్ కంపెనీకి పనులను అప్పగించిం ది. ఇదే క్రమంలో ఓపెన్ కెనాల్, పంప్ హౌజ్, విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు భూ సేకరణ చర్యలు చేపట్టి పనులను వేగవంతం చేశారు. బుధవారం మరోమారు ఊట్కూర్ మండలంలోని బాపురం, తిప్రాస్‌పల్లి శివారు రైతుల వ్యవసాయ పొలాల్లో ఇరిగేషన్ డీఈ కేతన్‌కుమార్, ఏఈఈ వెంకటప్ప రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకారంతో సర్వేకు సిద్ధం కావడంతో ఇరు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పొలాల వద్దకు చేరుకున్నారు.
సీఎం సొంత జిల్లాలో బతుకుతున్న తమ పొలాలకే భద్రత లేకుండా పోతే ఎలాగని అధికారులను ప్రశ్నించారు. ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూములను సీఎం సొంత నియోజకవర్గం మేలు కోరి తన్నుకుపోతే తాము ఎలా బతకాలని నిలదీశారు. రైతుల రాకను గుర్తించిన రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల సర్వే సాకు చెప్పి ఘటనా స్థలం నుంచి మెల్లగా జారుకున్నారు. కాగా, అధికారులు మాత్రం సాయంత్రం పొద్దుపోయిన సమయాల్లో సర్వేకు వస్తున్నారని, దీంతో రాత్రి, పగలు తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని శాపనార్థాలు సీఎం, సర్కారుపై పెడుతున్నారు. సర్వే కోసం వచ్చిన ఇరిగేషన్ అధికారులను సైతం రైతులు, బీఆర్ఎస్ నేతలు అడ్డుకొని వాహనాన్ని ఊరి పొలిమేర నుంచి దాటించారు.
సీఎం, ఎమ్మెల్యే స్పందించాలి..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి భద్రత లేకుండా పోయిందని తాజీ మాజీ జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, తిప్రాస్‌పల్లి మాజీ సర్పంచ్ సుమంగళ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. భూ సేకరణకు వ్యతిరేకంగా తిప్రాస్‌పల్లి, బాపురం శివారు గ్రామాల రైతులు చేపట్టిన నిరసనకు బీఆర్ఎస్ నాయకులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. బుధవారం తిప్రాస్‌పల్లి, బాపురం శివారు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై రైతులతో కలిసి భైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల తీరుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎత్తిపోతలకు తా ము వ్యతిరేకంగా కాదని, కొడంగల్‌ను పచ్చబరచి ఊట్కూ ర్ మండలాన్ని ఎడారిగా మార్చేందుకు ఓపెన్ కెనాల్ ద్వారా కాకుండా పైప్‌లైన్ ద్వారా కొడంగల్‌కు సాగునీటిని అందించేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ ప్రాంత రైతులకు సైతం ఓపెన్ కెలాల్ ద్వారా సాగు నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించిన పచ్చని పొలాల్లో పంప్ హౌస్, సబ్ స్టేషన్ నిర్మాణాలు జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రశ్నించిన రైతులపై ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులకు తెగబడుతోందని, వీడియోలు, ఫొటోలు చిత్రీకరించిన రైతుల సెల్ఫోన్లను లాక్కొని భయపెడుతున్నారన్నారు. ప్రజాపాలనలో రైతులకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, సీఎం స్పం దించి భూ సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఊట్కూర్ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, శ్రీనివాసులు, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.