భూత్పూర్ : బీఆర్ఎస్ ( BRS ) రజతోత్సవాల సందర్భంగా భూత్పూర్ ( Bhutpur ) మండలంలోని గ్రామాలు జెండా పండుగకు ( Flag festival ) , బహిరంగ సభకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తి సభకు వెళ్లేందుకు ముందుగా బీఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు అన్ని గ్రామాల్లోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
జెండా ఆవిష్కరణల కోసం ప్రత్యేకంగా దిమ్మెలు, జెండా కర్రలను ఏర్పాటు చేసుకున్నారు. వాటికి గులాబీ రంగు పెయింటింగ్ వేసి సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా గ్రామాల్లో పండగ వాతావరణాన్ని తలపించేలా గులాబీ తోరణాలను ఏర్పాట్లు చేయగా గత పది రోజులుగా మండలంలో బీఆర్ఎస్ నాయకులు వాల్ పోస్టర్లు, వాల్ పేయింటింగ్లు వేయించారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ సత్తూర్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ సర్పంచులు సత్తూరు నారాయణ గౌడ్, నరసింహ గౌడ్, వెంకటయ్య, ఫసియొద్దిన్, నాయకులు గోప్లాపూర్ సత్యనారాయణ, ఆల శ్రీకాంత్ రెడ్డి తదితరులు వారి వారి ప్రాంతాల్లో ఏర్పాట్లను ముమ్మరం చేశారు.