మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 29 : మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన చర్య లు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజ్, ఒకేషనల్ కళాశాలలను ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తాగునీరు, విద్యుత్, మౌలిక స దుపాయాలు కల్పించేందుకు రూ.73.10లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలకు రూ.21.50లక్షలు, ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలకు రూ.12.55లక్షలు, బాలికల జూనియర్ కళాశాలకు రూ.22.05 లక్షలు, ప్రభుత్వ ఎంవీఎస్ జూనియర్ కళాశాలకు రూ.17లక్షలు కేటాయించినట్లు ఆ యన తెలిపారు. ఈ నిధులను వినియోగించి వెంటనే ఆయా కళాశాలల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, సిరాజ్ఖా ద్రీ, భగవంతాచారి, జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, జూన్ 29 : కవులు, క ళాకారులు, గాయకులు, వారి పాట లేనిదే తె లంగాణ ఉద్యమం లేదని, ఆట, పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నింపిందని ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ లో తెలంగాణ కళాకారులు ఆధ్వర్యంలో నిర్వహించిన పాటల పల్లకి 12 గంటల పాలమూరులో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాకారులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
వారి సమస్యలను పరిష్కారించేందు కు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, అం జయ్య గౌడ్, ఉద్యమ కవి గాయకులు కిశోర్, టీపీసీసీ సాంస్కృతిక సేవ అధ్యక్షుడు రఘు, కళాకారులు శ్రీనివాస్, నర్సింహులు, బాలస్వామి, రమాదేవి, డప్పు స్వామీ, మురళి, జక్కగోపాల్ పాల్గొన్నారు.