కొల్లాపూర్, ఏప్రిల్ 18 : జగిత్యాలలో సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభతో కాంగ్రెస్ పతనానికి నాంది అవుతోందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ‘నమ స్తే తెలంగాణ’తో మాట్లాడుతూ దొంగ హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఏ క్షణం ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అ మలు కాలేదన్నా రు. రైతు భరోసా, రైతు రుణమాఫీలను పూర్తి స్థాయి లో అమలు చేయలేని స్థితిలో ప్రభు త్వం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత జగిత్యాల గడ్డపై బహిర్గతం కానున్నట్లు తెలిపారు. ప్రజా ఆశ్వీరాద సభ కు లక్షలాదిగా గులాబీ శ్రేణులు తరలి వస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని ప్రజా ఆశ్వీరాదంతో వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. కాంగ్రెస్ అరాచకాలకు కాలం చెల్లినట్లు ఆయన స్పష్టం చేశారు.