కోడేరు, మే 18 : కాకతీయులు.. గొలుసుకట్టు చెరువులు, కుంటలను తవ్విం చి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశారని, వారి స్ఫూర్తితో సీఎం కే సీఆర్ సాగునీటి రంగానికి పెద్దపీట వేశారని కొల్లాపూర్ ఎ మ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్ అధ్యక్షతన గురువా రం కోడేరు మండలకేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే బీరం ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసా య రంగానికి అధిక ప్రా ధాన్యత ఇస్తున్నారన్నారు. చెరువులు, కుంటలను మి షన్ కాకతీయ పథకం ద్వా రా మరమ్మతులు చేయించామన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎంజీకేఎల్ఐ అందుబాటులోకి రావడంతో.. ఎటు చూసినా జల పరవళ్లు దర్శనమిస్తున్నాయన్నారు. పంట పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయన్నా రు. గతంలో 20 ఏండ్లు పాలించిన నాయకులు.. ఎంజీకేఎల్ఐ కాల్వల డిజైన్‌లో నీటి సామర్థ్యాన్ని తగ్గించి చివరి ఆయకట్టుకు నీరందకుండా చేశారని ధ్వ జమెత్తారు. ప్రభుత్వం నిర్వహించిన టెండర్ ప్రకారం కాకుండా తమ వ్యక్తిగత స్వార్థం కోసం నిబంధనలకు విరుద్దంగా రీ డిజైనింగ్ చేయించి కాల్వల ఎత్తు, వెడల్పును తగ్గించారని ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఎంజీకేఎల్ఐ పెండింగ్ పనులను పూర్తి చేయించి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తున్నామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి లెక్కలేనన్ని రోడ్లు, వంతెనలు, ఏడు రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయించానని ఎమ్మెల్యే బీరం తెలిపారు.
రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. దళితబంధు రెండో విడుతతో కోడేరు మండలానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నా రు. కొల్లాపూర్‌కు సోమశిల-సిద్ధేశ్వరం వంతెన, నాలుగులేన్ల రోడ్డు, మామిడి మార్కెట్, కోడేరుకు డబుల్‌రోడ్డు వంటి పనులు మంజూరు చేయించానన్నారు. గ తంలో రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపేవారని, నేడు ఎంత వర్షం వచ్చినా రహదారులపై చుక్క నీరు కూడా నిలవదన్నారు. కోడేరు మండలానికకి రూ.25.31 కోట్లు నిధులు మంజూరయ్యాయని, వీటితో చేపట్టిన కొన్ని పనులు పూర్తికాగా, మరికొన్ని పురోగతిలో ఉన్నాయన్నారు. పస్పుల గ్రామానికి చెందిన 500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేందుకు ఇటీవల మినీ లిఫ్ట్‌ను ప్రారంభించామన్నారు.
కోడేరు ఉమామహేశ్వరస్వామి ఆలయంలో కల్యాణమండపం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, నాగులపల్లి, బావాయిపల్లి గ్రామాల్లోని వాగులపై వంతెనల నిర్మాణానికకి కూడా నిధులను మంజూరయ్యాయన్నారు. కోడేరు నుంచి నాగులపల్లికి డబుల్‌లేన్ బీటీ పనులు కొనసాగుతున్నాయన్నారు. కల్వకోలు నుంచి వయా కొండ్రావుపల్లి, ఎత్తం గ్రామాల మీదుగా మైలా రం వరకు బీటీ రోడ్డు రెన్యూవల్ కోసం రూ.2.90 కోట్లు మంజూరయ్యాయని, పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.
ఇదంతా అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. సింగవట్నం-గోపల్‌దిన్నె లింక్ కెనాల్‌ను మంజూరు చేసుకున్నామన్నారు. నిన్న మొన్నటి వరకు సీఎం కేసీఆర్‌ను వేనోళ్ల పొగిడిన వారు.. నేడు తమ స్వార్థం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.., వీ టన్నింటికీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అంతకుముందు ప్రభుత్వ పథకాలపై ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. అంబేద్కర్, శ్రీకాంతాచారి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రఘువర్ధన్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్ధి రాజవర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు జగదీశ్వర్‌రావు, సింగిల్‌విండో చైర్మన్లు చిన్నారెడ్డి, కృష్ణారెడ్డి, రుక్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్‌నాయక్, మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, విండో డైరెక్టర్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.