కోడేరు, జూలై 20 : మారక్తం కావాలంటే ఇస్తాం.. తీసుకోండి .. కానీ ముందుగా రైతులకు ప్రభుత్వం సాగునీరు అందించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కోడేరు మండలం ఖానాపూర్ శివారులో ఎంజీకేఎల్ఐ పరిధిలోని జొన్నలబొగుడ రిజర్వాయర్‌ను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రిజర్వాయర్‌లో నీటినిల్వ ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
ఈ వానకాలంలో రైతులు వరి పంటల సాగు కోసం తుకాలు పోసుకొని అదును దాటిపోతున్నందున కరిగెట్లు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారం రోజుల్లో నీరు విడుదల చేయకుంటే రైతులతో కలిసి తామే నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు పక్షానా ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఎన్నికేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని స్పష్టం చేశారు. వరి నారు మళ్లు ముదిరిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. ప్రభు త్వం స్పందించి రైతుల ప్రయోజనాలు కాపాడటానికి వెంటనే రిజర్వాయర్ నుంచి సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. లేని చో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ని ర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో పెద్దకొత్తపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.