పాలమూరు, జూలై 14 : బీసీల హక్కులు సాధించుకునేందుకు విద్యావంతులు, కవులు, రచయితలు బహుజన ఉద్యమ రూపకల్పన చేయాల్సిన అవసరమున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ అన్నా రు. ఆదివారం పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని లుంబినీ పాఠశాలలో ధిక్కార కవితా సంకలన ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయపోరాటానికి ఉప కులాలన్నింటినీ ఓటు యం త్రాలుగా మార్చి 77ఏండ్లుగా కొందరు మాత్రమే పాలిస్తున్నారన్నారు.
స్థానిక సంస్థల్లో 42శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అందుకు కట్టుబడి ఉండాలని, లేదంటే తగిన గుణపాఠం చెబుతామన్నారు. అనంతరం ధిక్కార పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత బెక్కం జనార్ధన్, కవి లక్ష్మణ్‌గౌడ్, పాలమూరు సాహితీ అధ్యక్షుడు భీంపల్లి శ్రీకాంత్, పుస్తక సంపాదకులు వనపట్ల సుబ్బ య్య, కొప్పుల యాదయ్య, ఖాజామైనొద్దీన్, గన్నోజు శ్రీనివాసాచారి, విఠలాపుర పుష్పలత, కర్నాటి రఘురాములుగౌడ్, అంబటి భానుప్రకాశ్‌తోపాటు సాహితీ అభిమానులు పాల్గొన్నారు.