నారాయణపేట రూరల్, జూన్ 9: పేట మండలంలోని సింగారం, శేర్నపల్లి, జాజాపూర్, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో శుక్రవారం బడిబాట కార్యక్రమం కొనసాగింది. జాజాపూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా జాజాపూర్, అప్పక్‌పల్లి, నిడుగుర్తి గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయడంతో పాటు పౌష్టికాహారం అందజేస్తారని తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణ, భానుప్రకాశ్, మాధవి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు దీటుగా
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పించి, మెరుగైన విద్య అందిస్తున్నదని గుడెబల్లూరు ప్రాథమిక పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, రాంరెడ్డి అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించామని తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత అడ్మిషన్‌తో పాటు పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నభోజనం అందిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృషిద, శోభారాణి, అంగన్వాడీ టీచర్ కమల, తదితరులు పాల్గొన్నారు.