కనులపండువగా అయ్యప్పస్వామి ఆలయ వార్షికోత్సవం
మండలంలో నిర్మించిన అ య్యప్పస్వామి ఆలయం నేటికీ ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆ దివారం వార్షికోత్సవ కార్యక్రమాన్ని గురుస్వామి అనిల్గౌ డ్ సమక్షంలో కనులపండుగగా నిర్వహించారు.
- మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
- పురవీధుల్లో స్వామి శోభాయాత్ర
- స్వాములకు అన్నదాన కార్యక్రమం
మక్తల్ టౌన్, డిసెంబర్ 4 : మండలంలో నిర్మించిన అ య్యప్పస్వామి ఆలయం నేటికీ ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆ దివారం వార్షికోత్సవ కార్యక్రమాన్ని గురుస్వామి అనిల్గౌ డ్ సమక్షంలో కనులపండుగగా నిర్వహించారు. స్వామి వా రికి అభిషేకం, హోమం, లక్షపుష్పార్చన, మహామంగళహారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్వాములు, భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కా ర్యర్రమంలో గురుస్వాములు అనిల్, శివరాం, అనిల్‌గౌడ్, శంకర్, నీలగౌడ్, రంజిత్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
ఉప్పర్‌పల్లిలో..
మండలంలోని ఉప్పర్‌పల్లి అయ్యప్పస్వామి ఆలయం లో షెడ్ నిర్మాణానికి ఆదివారం గురుస్వామి శ్రీధర్‌గౌడ్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో మహా పడిపూజ
ఊట్కూర్, డిసెంబర్ 4 : అయ్యప్ప మహా పడిపూజ కా ర్యక్రమాన్ని మండలంలోని బిజ్వారం అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం ఆశ్రమంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో స్వాములు ఘనంగా నిర్వహించారు. దుర్గామాత భక్తుడు ఆదిత్య పరా శ్రీ ఆధ్వర్యంలో పాలు, పండ్లు, పంచామృతం, తేనె, చంద నం, సుగంధ ద్రవ్యాలతో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజ లు, అభిషేకం చేశారు. ఘనంగా మెట్ల పూజ నిర్వహించా రు. పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించగా అయ్యప్ప మా లధారణ స్వాముల కీర్తనలతో గ్రామం పులకించిపోయింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కా ర్యక్రమంలో వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు, భక్తు లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు
నారాయణపేట రూరల్, డి సెంబర్ 4 : మండలంలోని అ ప్పిరెడ్డిపల్లి లక్ష్మణ్ గురుస్వామి స్వగృహంలో ఆదివారం అయ్యప్పస్వామి మహా పడిపూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వాములు పాడిన పాటలతో ఈ ప్రాంతమంతా అయ్య ప్ప నామస్మరణతో మార్మోగిం ది. సర్పంచ్ ప్రభావతి, ఎంపీటీ సీ జయమ్మ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్వాములకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

