మాగనూర్ : మండలంలోని వడ్వట్ ( Vadvat ) గ్రామంలో లక్ష్మీ కాంత్ రెడ్డి సివిల్ స్వామి నివాసంలో మహేష్ గంట స్వామి చేతుల మీదుగా అయ్యప్పస్వామి పడిపూజ ( Padi Puja ) వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు అశోక్ గౌడ్ , తాళంపల్లి అనిల్ ఆధ్వర్యంలో శనివారం అయ్యప్పస్వామికిపంచామృతా అభిషేకాలు, పసుపు కుంకుమ చందన అభిషేకాలతో పాటు పాటు అష్టోత్తరం, మహా మంగళ హారతి చేపట్టారు.
శభరిగిరిశుడికి నైవేద్యం సమర్పించారు. మాలదరులకు, సివిల్ స్వాములకు భిక్ష ప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా నీలాగౌడ్ గురుస్వామి, విజయ్ గురుస్వాములు ఆధ్వర్యంలో ఆలపించిన అయ్యప్పస్వామి భజన పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో గురుస్వాములు పవన్ గౌడ్ , లక్ష్మణ్ గౌడ్ ,శ్రీధర్ గౌడ్ , శేఖర్ గౌడ్ , రంజిత్ రెడ్డి, అయ్యప్ప మాలాధారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.