జోగులాంబ గద్వాల : ఇండియన్ రెడ్ క్రాస్ ( IRS ) సొసైటీ జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala) జిల్లా అధ్యక్షుడిగా సంగాల అయ్యప్ప రెడ్డి ( Ayyappa Reddy ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు. 2025-2028 మూడేళ్ల పదవీకాలానికి నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం జరిగింది. రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యునిగా జి. రమేష్ , వైస్ చైర్మన్గా డిఎండి తాహిర్ , ధనలక్ష్మి ఖజాంచీగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.
జిల్లా కార్యనిర్వాహక సభ్యులుగా కరాటే శ్రీహరి, ఎండీ అప్సర్ పాషా,చాగాపురం లక్ష్మీనారాయణ గౌడ్, బండారి పాల్ సుధాకర్, వరదా రవికుమార్, గంగాధర్ గౌడ్, జయరామయ్య, మోహన్ రావు, అక్బర్ బాషా, నల్లా రెడ్డి ఎన్నికైనట్లు వివరించారు. తదనంతరం కొత్తగా ఎన్నికైన పాలకమండలి సభ్యులను ఎన్నికల అధికారి, సొసైటీ సభ్యులను సన్మానించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ, తమ పదవీకాలంలో జోగులాంబ గద్వాల జిల్లాకు రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత భవనం,రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.