
మహబూబ్‌నగర్, డిసెంబర్ 6 : అందరి ఆకలి తీర్చే అన్నదాత లాభదాయకంగా అడుగులు వేయాలనే సంకల్పంతో వ్యవసాయ శా ఖ అధికారులు సరికొత్త ఆలోచనా విధానాని కి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రైతులను ఒక చోట చేర్చి సమావేశాలు ఏర్పాటు చేసి అ వగాహన కల్పించేవారు. కానీ ఇప్పుడు సమావేశాలపై ఆసక్తి చూపని రైతుల వద్దకే నేరుగా వెళ్లి ఇతర పంటలు సాగు చేస్తే వచ్చే లాభాల ను వివరిస్తున్నారు. గ్రామాల్లోని రచ్చకట్ట, టీ స్టాళ్లు, హోటళ్ల వద్దకు అధికారులు స్వ యంగా వెళ్లి ఇతర పంటల సాగుపై నచ్చజెప్పుతున్నారు. గత సీజన్లో మహబూబ్‌నగ ర్ జిల్లా వ్యాప్తంగా 1.20 ఎకరాల్లో వరి సా గు చేశారు. ఈ ఏడాది యాసంగిలో వరి సా గు తగ్గించి.. ఇతర పంటల సాగు వల్ల అధిక లాభం ఆర్జించేలా రైతులను సమాయత్తం చేస్తున్నారు. ఏండ్లుగా మూసధోరణిలో వరిసాగు చేయడం వల్ల భూసారం దెబ్బతింటున్నది. పంట దిగుబడి కూడా తగ్గుతున్నది. ఈ తరుణంలో పెసర్లు, మొక్కజొన్న, వేరుశనగ, మినుములతోపాటు ఇతర పంటలను పండించి తక్కువ సమయంలో అధిక లా భాలు పొందాలని అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో డిమాండ్ ఉన్న కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది.
విస్తృతంగా అవగాహన..
వరి బదులు ఇతర పంటలను పండించేందుకుగానూ గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యేక సమావేశాలతోపా టు నలుగురు, ముగ్గురు ఉన్న చోటకు వెళ్లి వ్యవసాయ అధికారులు ఇతర పంటల వల్ల వచ్చే లాభాలను వివరిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి సారించేలా సూచనలు, సలహాలు అందిస్తున్నాం.