మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 23 : ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల వెన్నముకను కాంగ్రెస్ ప్రభుత్వం విరగొట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. సోమవారం నుంచి చేపట్టనున్న ఆటోల నిరవధిక బంద్ పోస్టర్‌ను ఆదివారం మాజీ మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భార్యకు ఉచిత ప్రయాణమంటూ భర్తకు రెండింతల టికెట్ ధర వసూలు చేస్తున్నారని, ఉచిత ప్రయాణంతో మ హిళలు సంతోషంగాలేరని, ప్రభుత్వం కొత్త బస్సులు ఇవ్వకుండా పాత బస్సులతో కాలం వెలదీస్తున్నారని ఆయన మం డిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు చేయకపోవడంతో ఆటో కార్మికులతోపాటు ఆర్టీసీ ఉ ద్యోగులు కూడా ఆందోళన బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వేలాది మంది కార్మికుల కుటుంబాలు ఆటోలమీద ఆధారపడి జీవిస్తున్నాయని,తక్షణమే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం అందించాలని డి మాండ్ చేశారు. ఆటో కార్మికులు ఐక్య పోరాటంతోనే ప్రభు త్వం దిగివస్తుందని, దీనికి ఢిల్లీలోని యువత చేసిన పోరాటమే నిదర్శనమని మాజీ మంత్రి పేర్కొన్నారు. రైతులు, మహిళలకు ఇతర వర్గాలకు ఇచ్చినట్టే ఆటో డ్రైవర్లలకు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ మాట త ప్పిందని విమర్శించారు. ఆటోల ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, కుటుంబ నిర్వహణతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోల బంద్‌కు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమం లో ఆటో జేఏసీ నాయకులు శ్రీనివాస్, బాబుమి యా, నాగేశ్, రాజ్‌కుమార్, సయ్యద్యాసిన్తోపాటు పలువురు ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు.
గిరిజనులు తమ ఆత్మగౌరవం కోసం తమ తండా ల్లో తమ పాలనే ఉండాలని నిరంతరం పోరాటం చేస్తూ వచ్చారని, వారి పోరాటాన్ని గౌరవించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘హమారా తండా మే హమారా రాజ్’ అనే నినాదాన్ని సాకారం చేస్తూ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన విషయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు. జీవీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10,11 తేదీలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే గిరిజన విద్యార్థుల వ్యక్తిత్వ వికాస సదస్సు వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ గతంలో గిరిజనుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమన్నారు. 6 శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను జీవో నెంబర్ 33 ద్వారా 2022లోనే 10 శాతానికి పెంచామని తెలిపా రు. తెలంగాణలో ట్రైబల్ గురుకులాలను ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించామని, మహబూబ్‌నగర్ పట్టణంలో గిరిజన బాలికల వసతి గృహం కూడా నిర్మించామన్నారు. కార్యక్రమంలో జీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయక్, లోకేశ్ నాయక్ పాల్గొన్నారు.