మహబూబ్‌నగర్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా గెలిపిస్తే గంట లోపల పేకాట ఆడిస్తా’.. అంటూ ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. జిల్లా క్లబ్లో అధికార పార్టీ నేతల రాజకీయ జోక్యం కారణంగా అకస్మాత్తుగా పాత కార్యవర్గం రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు డిస్ట్రిక్ట్ క్లబ్‌పై కన్నేశాడు. ఇంకేముంది పది మందికి ఉపయోగపడే క్లబ్‌ను పేకాట హబ్‌గా మార్చేం దుకు కంకణం కట్టుకున్నట్లు ప్రచారం జోరందుకున్నది.
నామినేషన్లకు శనివారం చివరి రోజు కావడంతో సదరు నేత క్లబ్ సభ్యులందరికీ ఫోన్లు చేసి తనను గెలిపిస్తే పేకాట ఆడిస్తానంటూ చెప్పడంతో అందరూ కంగుతింటున్నారు. మరోవైపు అధ్యక్ష పదవికి ఎవరు నామినేషన్లు వేయకుండా.. పోటీ చేయడానికి ముందుకు రాకుండా బెదిరిస్తున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని ఆఫీసర్స్ క్లబ్ కాస్త పేకాట క్లబ్‌గా మళ్లీ మారే అవకాశాలు కని పిస్తున్నాయి. ఇక్కడి క్లబ్లో జిల్లా అధికారులతో పాటు.. పట్టణంలోని డాక్టర్లు, లాయర్లు, ప్రముఖ రాజకీయ నేతలు సభ్యులుగా ఉన్నారు. అయితే ఎంతో చారిత్రాత్మక వైభవం ఉన్న ఈ క్లబ్‌ను గతంలో కొందరు భ్రష్టు పట్టించారు. దీంతో పోలీసులు దాడులు చేసి పేకాటను శాశ్వతంగా మూయించారు.
ఈ మేరకు హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే తాజా పరిణామాలు పరువు తీసేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఈ క్లబ్‌ను సెటిల్మెంట్కు అడ్డాగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనం ప్రారంభోత్సవం కోసం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పాత కార్యవర్గాన్ని బలవంతంగా రాజీనామా చేసేలా చేశారని ప్రచారం జరుగుతున్నది.
పాలమూరు క్లబ్లో రూ.కోట్లు ఖర్చు చేసి పట్టణ ప్రముఖులు కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమాలు చేసుకునే విధంగా రూపొందించారు. అయితే దీనిపై రాజకీయం చేయడంతో సిట్టింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన మనస్తాపం చెంది రాజీనామా చేసేలా చేయడంతో డిస్ట్రిక్ క్లబ్లో రాజకీయ జోక్యం మొదలైందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం నిర్మించిన భవనానికి మున్సిపల్ అనుమతులు కూడా లేనట్లు ప్రచారం జరుగుతోంది. పాత కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్త కార్యవర్గం ఎన్నికలు జరుగుతున్న తరు ణంలో ఓ కాంగ్రెస్ నేత బలవంతంగా క్లబ్‌పై పెత్తనం చలాయించేందుకు చూస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు అధ్యక్ష పదవితోపాటు మిగతా కార్యవర్గానికి అధికార పార్టీ మద్దతు దారులు తప్పా మిగతావాళ్లు నామినేషన్లు వేయ కుండా కట్టడి చేస్తున్నట్లు సభ్యులే వాపోతున్నారు. పాల మూరు జిల్లా కేంద్రంలో ఎంతోమంది హేమాహేమీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ క్లబ్ రాజకీయ వివాదంలో చిక్కుకోవడంతో చాలామంది బయట చెప్పు కోలేకపపోతున్నారట. అధ్యక్ష పదవి ఆశిస్తున్న సదరు కాంగ్రెస్ నేతపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమ వుతోంది. ఈ వ్యవహారం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లు ప్రచారం జోరందుకున్నది. మొత్తంపైన మహ బూబ్‌నగర్ జిల్లా క్లబ్‌పై రాజకీయ నీడలు కమ్ముకోవడంతో పట్టణ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.