ఖిల్లాఘణపురం, జూన్ 16 : కోళ్ల పందేలు నిర్వహిస్తుండగా దాడులు నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేసిన ఘటన ఖిల్లాఘణపురం మండలం మానాజీపేట శివారులో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మానాజీపేట శివారులో గార్లబండతండాకు చెందిన మాన్యానాయక్ ఆధ్వర్యంలో ఆదివారం కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడి చేసినట్లు తెలిపారు. 16 బైకులు, 7 సెల్ఫోన్లు, 11 పందెం కోళ్లతోపాటు రూ.10,730 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా మాన్యానాయక్, చిన్నమందడికి చెందిన బాలరాజు, మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్, కనిమెట్టకు చెందిన రాజశేఖర్, శ్రీరంగాపురానికి చెందిన సత్యనారాయణ, మదనాపురానికి చెందిన విష్ణు, జడ్చర్లకు చెందిన రాజును అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారైనట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.