వడ్డేపల్లి : ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో పాల్గొనాలని ఆర్ట్ ఆఫ్ గివింగ్( Art of Giving ) జిల్లా కో ఆర్డినేటర్ సుధీర్ కుమార్( Sudeer Kumar ) అన్నారు. శనివారం అయిజ,శాంతినగర్ పట్టణంలో ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, పండ్లు, శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైబర్ గుడ్ అనే నినాదంతో ప్రొఫెసర్ అచ్యుత్ సమంత పిలుపుమేరకు తెలంగాణ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.
సమాజంలో నిరుపేదలకు సేవ చేయడం తమ బాధ్యతగా గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా యువతి, యువకులు సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు మధు, సుధాకర్, రఘు, గోవర్ధన్ , రాజశేఖర్, గిరి, రాణాప్రతాప్, విజయ్ కుమార్ ,వినోద్ , సచిన్ , శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.