Arrest Demand | విలేకరులపై దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలి
Arrest Demand | నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో విలేకరులపై దాడి చేసిన దుండగుల ను వెంటనే అరెస్టు చేయాలని ఊట్కూర్ మండల ప్రెస్ క్లబ్ నాయకులు డిమాండ్ చేశారు.
ఊట్కూర్ : నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో విలేకరులపై దాడి చేసిన దుండగుల ను వెంటనే అరెస్టు (Arrest ) చేయాలని ఊట్కూర్ ( Utkoor ) మండల ప్రెస్ క్లబ్ నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణానదిలో అక్రమ ఇసుక రవాణా ( Illegal Sand Transport ) ను కవర్ చేసేందుకు వెళ్లిన నమస్తే తెలంగాణ మాగనూరు విలేకరి రాము, ఫోటోగ్రాఫర్ తాహెర్ అలీపై ఇసుక మాఫియా దాడికి పాల్పడటం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడేనని వారు ఖండించారు.
ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న పాత్రికేయులపై భౌతిక దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. అక్రమ ఇసుక దందాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇవ్వాలని, దోషులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరారు.
ఈ సమావేశంలో ఊట్కూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు అశోక్, విఠోబా, మంజూర్ అలీ, వెంకట్ రాములు, భానుచందర్, అష్ఫక్, సల్మాన్, నరసింహ, వెంకటేష్, అనీల్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

