ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కల త్వరలో నెరవేరనున్నది. ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకునేందుకు పీఆర్ఎల్ఐ సిద్ధమైంది. ప్రతిపక్ష నాయకుల కేసులు, అడ్డంకులను దాటుకొని బీడువారిన పొలాలను ముద్దాడేందుకు కృష్ణమ్మ పరుగుపరుగున తరలిరానున్నది. రికార్డుస్థాయిలో పంప్‌హౌస్‌లు, సర్జ్పూల్ల నిర్మాణం పూర్తయింది. ఈ మేరకు బుధవారం ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 16న కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ ఇన్‌టేక్‌వెల్ వద్ద స్విచ్ ఆన్ చేసి వెట్న్‌న్రు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో మిగిలిన పనులను అధికారులు పూర్తి చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా వరప్రదాయిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి ఈనెల 16న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ రానున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద మొదటి పంపును ఆన్‌చేసి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం అన్ని అడ్డంకులను దాటుకుని బీడు భూములకు కృష్ణమ్మ జలాలు పరుగు పరుగున రానున్నాయి. బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు అబ్ర హం, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారా యణరెడ్డి, సురభి వాణీదేవి, షాట్ చైర్మన్ ఆంజనేయగౌడ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చిన తక్కువ సమయంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదలకు సన్నాహాలు చేయడం రికార్డుగా పేర్కొంటున్నారు.
పర్యావరణ అనుమతులు రాకముందు సుప్రీంకోర్టు తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవచ్చని ఉత్తర్వులిచ్చింది. ఈ పథకంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని రోజులకే కేంద్రం దిగివచ్చి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది. దీంతో ఈ పథకం పనులు జెట్ స్పీడ్‌తో సాగుతున్నాయి. పనులను దక్కించుకున్న ఏజెన్సీలు, టెక్నికల్ ఇంజినీర్లు, ట్రాన్స్‌కో, ఇరిగేషన్ అధికారులు రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ వద్ద 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు పవర్ చార్జింగ్ విజయవంతమైంది.
నల్గొండ జిల్లా డిండి నుంచి 60 కి.మీ. హైటెన్షన్ విద్యుత్ లైన్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఏదుల నుంచి నార్లాపూర్ వరకు 30 కి.మీ. హైటెన్షన్ విద్యుత్ లైన్లను రికార్డు స్థాయిలో పూర్తి చేసి 400 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా విజయవంతంగా పూర్తి చేశారు. ఒకవైపు సబ్స్టేషన్ల పనులు కొనసాగుతుండగానే మరోవైపు పంపింగ్ హౌస్‌లో 145 మెగావాట్ల బాహుబలి పంపులను బిగించే ప్రక్రియ పూర్తి చేశారు.
ఈ పంపులకు సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరాను అందించారు. ఈనెల 3న డ్రై రన్ విజయవంతంగా పూర్తి చేసి మోటర్ ఆన్ చేశారు. దీంతో సర్జ్‌పూల్‌లో నీటిని తోడేందుకు మిగిలిపోయిన పనులను కంప్లీట్ చేస్తున్నారు. దీంతో పంపుద్వారా నీటిని ఏదుల పంపుహౌజ్‌లోకి పంపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వెట్న్‌న్రు పరీక్షించి ఎలాంటి ఆటంకం లేకుండా నీటిని పంపింగ్ చేస్తామని ఇరిగేషన్ అధికారులు ధీమా వ్యక్తం చేయడంతో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది.
సీఎం కేసీఆర్ పట్టుదలతో పాలమూరుకు మోక్షం..
తెలంగాణ ఉద్యమ సమయంలో పాలమూరు జిల్లాలో కరువు, ఆకలి చావులు, వలసలను చూసి చలించిన కేసీఆర్ ఆ రోజుల్లోనే అంచున ఉండే కృష్ణానది నీటిని బీడుబారిన భూములకు అందించాలని సంకల్పించారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రస్తుత మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి అనేక ప్రాంతాలను చూసి చలించిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఇంజినీర్లు కల్వకుర్తి ఎత్తిపోతలతోపాటు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా డిజైన్ చేసి సర్వేను చేపట్టారు. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు కల్వకుర్తి ఎత్తిపోతలకు మాత్రమే అనుమతి ఇచ్చి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొండిచేయి చూపారు.
దీంతో 2009లో పాలమూరు ఎంపీగా కేసీఆర్ పోటీ చేసి గెలుపు బావుట ఎగురవేశారు. 2014లో తెలంగాణ (స్వరాష్ర్టాన్ని)ను సాధించారు. 2015 జూన్ 11న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన వద్ద శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును సమూలంగా మార్చివేసి ఇరిగేషన్ అధికారులతో రేయింబవళ్లు చర్చించి భారీ ఎత్తిపోతల పథకానికి తుది రూపం ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 10లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.30లక్షల ఎకరాలకు సాగునీరును అందించేందుకు కంకణం కట్టుకున్నారు. అయితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే రాజకీయంగా పుట్టగతులు ఉండవని కేసులు వేశారు. అనుమతులు ఇవ్వకుండా కేంద్రం మోకాలడ్డు వేసినా సీఎం కేసీఆర్ పట్టుదల ముందు ఓడిపోయింది. చివరికి అన్ని అనుమతులు సాధించి ఈ ప్రాజెక్టుకు మోక్షం కల్పించారు.
16న నార్లాపూర్‌కు సీఎం రాక..
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్న్‌న్రు ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ ఈ నెల 16న వస్తున్నారు. నార్లాపూర్ ఇన్‌టేక్‌వెల్ వద్ద స్విచ్ ఆన్ చేసి ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే భారీ బాహుబలి పంపులతో ఎత్తిపోతల పథకం సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మించి ఎక్కువ హార్స్ పవర్ గల పంపులను ఇక్కడ బిగించారు. 145 మెగావాట్ల సామర్థ్యంతో మహా బాహుబలి పంపులను బీహెచ్ఈఎల్ తయారు చేసింది. ఈ నెల 3న ఇరిగేషన్ ఉన్నతాధికారుల సమక్షంలో డ్రై రన్ విజయవంతమైంది. దీంతో వెట్న్‌న్రు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేసే కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాక, కొల్లాపూర్‌లో జరుగబోయే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
ఆనందంతో అన్నదాతలు ..
దశాబ్దాలుగా కలలుగన్న కృష్ణానది జలాలు పాలమూరు బీడు భూములకు పారించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఎత్తిపోతల పథకం ప్రారంభానికి మోక్షం లభించడంతో ఉమ్మడి జిల్లాలోని అన్నదాతలు ఆనందంతో పొంగిపోతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పుడు ఆయకట్టుకు మించి కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందుతుండడంతో ఉమ్మడి జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. ఎత్తిపోతల పథకం విశేషాలతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ప్రచురించిన కథనాలను ఊరూరా చర్చిస్తున్నారు. పక్కనే ఇంత భారీ ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావడం చాలా సంతోషంగా ఉన్నది. సీఎం చేతుల మీదుగా ఎత్తిపోతల పథకం ప్రారంభించుకునే రోజు ఉమ్మడి జిల్లాకు పండుగ రోజు. సాగునీటి, తాగునీటి గోసలు తీర్చుతున్న సీఎం కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ మరువలేరు. ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి దగ్గరుండి డిజైన్ చేసి ఇవాళ కృష్ణానది జలాలను బీడు బారిన పొలాలకు అందించే బృహత్ కార్యానికి శ్రీకారాన్ని చుడుతున్నారు. జిల్లా ప్రజల తరుపున సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు.
– శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖ మంత్రి
ఎత్తిపోతల పథకం శుభదినం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వస్తుందని ఎవరూ ఊహించలేదు. రైతుల కలను నిజం చేసిన మహానుభావుడు సీఎం కేసీఆర్. ఆయన చే తుల మీ దుగా ఎత్తిపోతల పథకం ప్రా రంభించడం ఉమ్మడి జిల్లాకు శుభసూచికం. కృష్ణా జలాలను 600 మీటర్ల ఎ త్తులో ఉన్న ఉదండాపూర్ వరకు ఎత్తిపోసే ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్. ఆయన రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేం.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి