SLBC Tunnel Mishap | మహబూబ్ నగర్ : దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనల మేరకు ఆర్మీ ప్రత్యేక బృందం దోమల పెంటకు చేరుకుంది. ఈ ఉదయం ప్రమాదం జరిగిన టన్నెల్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సహాయక చర్యల్లో పాలు పంచుకుంటుంది. ఇప్పటివరకు ఎనిమిది మంది ఆచూకీ ఇంకా లభ్యము కాలేదు.
కొంతమంది ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగిన చోటికి వెళ్లినప్పటికీ.. అక్కడ ఉన్న బురదను కాంక్రీట్ స్లాబులను ఉబికి వస్తున్న నీటిని తోడటం సాధ్యం కాలేదు. ప్రమాదం జరిగినచోట పరిస్థితిని అంచనా వేసిన బృందం ఆర్మీతో కలిసి హై రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది. సొరంగంలో పైకప్పు కూలి చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. టన్నెల్లో ఇరుక్కుపోయిన కార్మికులను వెలుపలికి తెచ్చేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీంతో పాటు ఆర్మీ సిబ్బంది ట్యూబులు, వెదురు తడకలు ఇతర సామాగ్రినీ లోపలికి తీసుకువెళ్లారు.
తిరిగి వస్తే కానీ తెలియవు..
తిరిగి సాయంత్రం ఐదు గంటలకు వచ్చే అవకాశం ఉంది. వెళ్లిన బృందాలు తిరిగి వస్తే కానీ లోపలి పరిస్థితులు తెలియవనీ అధికార యంత్రాంగం చెబుతుంది. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కోసం అనేక రకాలుగా రెస్క్యూ చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్టీ, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, అధికారులతో సమీక్షలు చేస్తూ.. రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేయాలో ఒక అవగాహనకు వచ్చారు. 13 కిలోమీటర్ల వరకు మూడు బృందాలు వెళ్లాయి. కానీ ఎక్కడైతే ప్రమాదం జరిగిన ప్లేస్ లో నీళ్లు మట్టి బురద ఉండటంవల్ల లోపలికి వెళ్లలేకపోయారు. 8 మంది ఉన్న ప్లేస్ లోకి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డ్రిల్లింగ్ చేసి అటువైపు వెళ్లడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పైనుంచి కూడా డ్రిల్లింగ్ చేసి సంఘటన స్థలంలోకి వెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. కాగా తెల్లవారుజాము వరకు సంఘటన స్థలంలో కొంతమంది మాటలు రెస్క్యూ బృందానికి వినిపించినట్లు సమాచారం.
ఇప్పుడు ఎటువంటి శబ్దాలు అయితే వినిపించదం లేదని చెబుతున్నారు. మరో రెండు మూడు గంటలపాటు డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తామని అంటున్నారు. ఎటు చూసినా మట్టి, బురద నీళ్లు ఉండటంవల్ల అక్కడ ఇబ్బంది నెలకొంది. కాగా తమవారు క్షేమంగా బయట పడాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.
Group-2 Mains | ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం
Gurukul Entrance Test | హాల్ టికెట్ ఉన్నా.. గురుకుల పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరణ
Woman Suicide | ఏడాది క్రితం ప్రేమ వివాహం.. రామంతపూర్‌లో గృహిణి ఆత్మహత్య