ఉప్పునుంతల, ఆగస్టు 6 : అధికార పార్టీకి చెంది న కొందరు నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడితో మనస్తాపం చెందిన అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చో టు చేసుకున్నది. అంగన్వాడీ టీచర్ భర్త పానుగంటి శ్రీను కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం ల క్ష్మాపూర్ గ్రామానికి చెందిన తాను బీఆర్ఎస్ కార్యకర్త అని.. తన భార్య శారద అంగన్వాడీ టీచర్‌గా ప నిచేస్తున్నదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిరోజులుగా స్థానిక నాయకులు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
సీడీపీవో ద్వారా అంగన్వాడీ టీచర్‌పై ఒత్తిడి తెచ్చి తరచుగా తప్పులు చేయకున్నా మె మోలు జారీ చేస్తున్నారని వాపోయారు. వీటికి లిఖితపూర్వకంగా తన భార్య జవాబు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా సంబంధిత సూపర్వైజర్, సీడీపీ వో కాంగ్రెస్ నేతల ఒత్తిడికి తలొగ్గారన్న ఆవేదన వ్య క్తం చేశారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకు ల వద్దకు వెళ్లి మాట్లాడుకోవాలని సూపర్వైజర్ తన కు సూచించినట్లు వివరించారు. దీనికి నా భార్య శార ద తాను దళిత మహిళనని, తాను చేసిన తప్పేంటి.. వారి వద్దకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ నోటీస్ జారీ చేశారని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రంలో ఉన్న నూనె ప్యాకెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినా తన భార్యే తీసుకెళ్లినట్లు ఆరోపణలు చేశారన్నారు. చోరీ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదన్నారు. దీనికితోడు తన భార్యపై నిందలు మోపడంతో మనస్తాపం చెంది మంగళవా రం ఇంట్లో పురుగుల మందు తాగిందని పేర్కొన్నారు. వెంటనే గుర్తించి నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతున్నదని చెప్పారు.
కాగా సీడీపీవో లక్ష్మి, సూపర్వైజర్ బీపాషాను వివరణ ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు. అయితే అంగన్వాడీ టీచర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన సూపర్వైజర్, సీడీపీవో, కాంగ్రెస్ పార్టీ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఎస్పీ, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. మా కుటుంబానికి హాని జరిగితే ఈ ముగ్గురే బాధ్యత వహించాలన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్రావు మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుం టే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.