లక్ష్యంతోనే విజయం
మండలంలోని బొక్కలోనిపల్లి గ్రామ శివారులో జయప్రకాశ్ నారాయణ ఇంజినీరిం గ్ కళాశాలలో శనివారం ఇంటర్ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
- సమాజ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకం
- విద్యపై ఏకాగ్రతతో అవగాహన పెంచుకోవాలి
- మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ
పాలమూరు, ఫిబ్రవరి 4 : మండలంలోని బొక్కలోనిపల్లి గ్రామ శివారులో జయప్రకాశ్ నారాయణ ఇంజినీరిం గ్ కళాశాలలో శనివారం ఇంటర్ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ హాజరయ్యారు. కళాశాలలో జయప్రకాశ్ నారాయణ, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజ నిర్మాణం లో ఇంజినీర్ల పాత్ర కీలకమని, ఇంజినీర్లు సమాజ అవసరాలను తీరుస్తారని అన్నారు. ఇంజినీర్లు లేనిదే ప్రపంచం లేదని, ఎంపీసీ చదివిన వారు భావితరాల్లో ఇంజినీర్లుగా అవుతారన్నారు.
విజయం సాధించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇంజినీరింగ్ చ దివితే సమాజంలో సమస్యలను తీర్చడానికి తోడ్పడుతార ని తెలియజేశారు. ఇంజనీరింగ్‌లో ప్రతి కోర్సు ముఖ్యమన్నారు. విద్యార్థులు సాధ్యమైనంత వరకు మొబైల్స్‌కు దూ రంగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రముఖ వక్తలు సీబీఐటి కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి, ఫ్రీలా న్స్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ రమేశ్ విప్పర్తి, కళాశాల చైర్మన్ రవికుమార్ ఇంజినీరింగ్ గురించి విద్యార్థులకు వివరించా రు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.సుజీవన్కుమా ర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.చంద్రశేఖర్, సందీప్‌కుమార్, స్విట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుధాకర్, కళాశాల డైరెక్టర్ వెంకరామారావు, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

