పాలమూరు, మే 13 : మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డు పరిధిలోని ఎదిర, దివిటిపల్లి, అం బటిపల్లి, సిద్ధాయపల్లి ప్రజలు ఐటీ పార్కులో ఏర్పాటు చేసిన అమరరాజా బ్యాటరీ కంపెనీని తొలగించాలని కో రుతూ సోమవారం పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు. దీంతో వార్డుల్లోని పోలింగ్ బూత్‌ల వద్ద పూర్తి నిశబ్ధ వాతావరణం నెలకొన్నది. పోలింగ్ అధికారులు కుర్చీలకే పరిమితమయ్యారు. సీఐ గాంధీనాయక్ ఆధ్వర్యం లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఈ సందర్భం గా వార్డు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అమరరాజా కంపెనీ వల్ల భవిష్యత్తులో మా ప్రాణాలకే ప్రమా దం ఉందని, నీరు, గాలి కాలుష్యం కావడంతో పరిసర ప్రాంతాలు కాలుష్యానికి గురై నష్టం వాటిల్లుతుందని, అందుకే పోలింగ్‌ను పూర్తిగా బహిష్కరించి నిరసన వ్య క్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ గోడును వెల్లబోసుకున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు.
మా ప్రాణాలంటే లెక్కలేనప్పుడు ఓటెం దుకేయాలని వారు ప్రశ్నించారు. 3,299 మంది ఓటర్ల కు గానూ కేవలం 130 మంది మాత్రమే ఓటు హక్కు వి నియోగించుకున్నా రు. కార్యక్రమం లో మాజీ కౌన్సిల ర్ శివశంకర్, కురు మ సంఘం జిల్లా అ ధ్యక్షుడు నర్సింహులు, మాజీ సర్పంచులు జంగ న్న, వెంకటయ్య, హకీం, ఎ ల్లయ్య, సత్యం, నర్సింహు లు, కృష్ణ, రాములు, అమరరాజా వ్య తిరేక పోరాట సమితి ప్రధాన కా ర్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి శేఖర్, నాగరాజు, శ్రీశైలం, అశోక్‌గౌడ్, నిరంజన్ ఉన్నారు.