మరికల్ : ‘ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలుసుకున్నారు చదువులమ్మ తల్లి నీడలో ’ అన్నట్లు 42 ఏళ్ల తర్వాత వారంతా కలుసుకున్నారు. 1982-83 లో మరికల్ ( Marikal ) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు (Alumni ) శనివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను( Teachers) సన్మానిస్తూ, గత మధురస్మృతులను నెమరు వేసుకున్నారు. చిన్ననాటి చిలిపి చేష్టలను గుర్తుచేసుకొని ఒకరినొకరు అభినందించుకున్నారు. 42 ఏళ్ల తర్వాత కలుసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చదువుకున్న విద్యార్థులు, తమకు విద్యాబుద్ధులు నేర్పించిన కొంతమంది ఉపాధ్యాయులు మృతి చెందడంతో వారికి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు వేముల సుందరయ్య శర్మ, రఘుపతి రెడ్డితోపాటు పూర్వ విద్యార్థులు అంపానీ బసవ కుమార్, గట్టు మహానందిస్వర్, బాలరాజ్ గౌడ్, నరేందర్ గౌడ్, జంగం ప్రకాష్, దండు రాములు, రతంగపాణిరెడ్డి, జైపాల్, బాల ప్రసాద్, జగదీశ్వరి, వరలక్ష్మి, రాధా, ఉమాదేవి పాల్గొన్నారు.