అలంపూర్ చౌరస్తా, ఏప్రిల్ 11 : అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన బడుగుల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఉండవెల్లి మండల అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు కిశక్షర్ ఆధ్వర్యం లో జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మా నవాతావాది అని అన్నారు. చదువు లేనిదే జ్ఞానం లేదని సత్యాన్ని గ్రహించి ఫూలే తన భార్య సావిత్రీబాయి ఫూలే తో కలిసి దేశంలోనే మొదటిసారిగా1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించిన మహనీయుడు జ్యోతిబా ఫూలే అని అన్నారు. కార్యక్రమంలో రఘురెడ్డి, గోపాల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.