కాంగ్రెస్‌ది పోలీస్ పాలన
కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని పోలీస్ పాలన అని కొత్తకోటలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న యువతకు ఫోన్లు చేసి పోలీసులు బెదిరించడం సరైందికాదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కొత్తకోట మండల కేంద్రంలోని క్యూఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన 150మంది యువకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మాజీ ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
- పాత, కొత్త తేడా లేకుండా పనిచేయాలి
- దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
- బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన కొత్తకోట, కనిమెట్ట నాయకులు
కొత్తకోట, జూలై 12 : కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని పోలీస్ పాలన అని కొత్తకోటలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న యువతకు ఫోన్లు చేసి పోలీసులు బెదిరించడం సరైందికాదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కొత్తకోట మండల కేంద్రంలోని క్యూఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన 150మంది యువకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మాజీ ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి కౌన్సిలర్ అయ్యన్న సభాధ్యక్షత వహించగా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, నియోజక సోషల్ మీడియా కన్వీనర్ ఆల ప్రీతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఆరు గురుకులాలు మంజూరైతే అందులో కొత్తకోటకు ఒకటి, దేవరకద్రకు మరొక గురుకుల కశాశాల సాధించి ఈ ప్రాంత నిరుపేద ముస్లింలకు కార్పొరేటుకు దీటుగా విద్యనందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు 420 మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం పెట్టి కాంగ్రెస్ మహిళల మధ్యన పంచాయితీ పెట్టిందని, దీంతో మహిళలకు ఒరింగిందేమి లేదన్నారు. ఫ్రీ బస్సు వలన వేల రూపాయలు జీతం తీసుకొంటున్న మహిళ ఉద్యోగులు లాభం పొందుతున్నారని కూలి పని చేసే మహిళలకు ఎలాంటి లాభం లేదని పైగా ఈ ప్రభుత్వం మగవాళ్ల వద్ద డబుల్ కిరాయి వసూలు చేసి దోచుకొంటుందని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.2500 పింఛన్ ఇస్తామని, రైతులకు రైతు బంధు రెండు పంటలకు కాదు, మూడు పంటలకు ఇస్తామని మూడుసార్లు ఈ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టి రైతాంగానికి మోసం చేసిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బీమా ప్రవేశపెట్టగా గత నాలుగు నెలలుగా ఎల్ఐసీ ప్రీమియం కట్టనందుకు రైతు బీమా అందడంలేదన్నారు. ఈ మధ్యకాలంలో 7600మంది రైతులు చనిపోగా వారికి రైతు బీమా అందక వారి కుటుంబాలు వీధి పాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు నెల ఆదాయం రూ.4వేల కోట్లు ఉంటే దానిని రూ.18,400కోట్లకు పెంచారని గుర్తు చేశారు. ప్రస్తుతం సర్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రతి కార్యకర్త పార్టీ నాయకుల,అభిమానుల ఓట్లు పోకుండా సర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని కాపాడాలని పిలుపునిచ్చారు. గ్రామాల్గో గల ప్రజలు హైదరాబాద్‌లో ఉంటే గ్రామాల్లో ఓటును పెట్టుకోవాలని కోరారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తి కావస్తున్నా మైనార్టీలకు కేటాయిస్తానన్న రూ.4వేల బడ్జెట్ కేటాయించకుండా మోసం చేసిందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ విమర్శించారు. కేసీఆర్ మైనార్టీల విద్య కోసం 204 గురుకులాలు ఏర్పాటు చేసి కార్పొరేటుకు దీటుగా విద్యనందించి తీర్చిదిద్దారని చెప్పారు. కాంగ్రెస్ 55ఏండ్ల పరిపాలనలో మైనార్టీలకు ఓటు బ్యాంక్‌గా వాడుకొన్నారని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో మైనార్టీ విద్యార్థులు విదేశి విద్యను చదివి ఉన్నత స్దాయికి ఎదిగారని అన్నారు. కేసీఆర్ హయాంలో రూ.2.75లక్షల మంది ఆడపిల్లల పెండ్లిళ్లు చేసి ముస్లిం మైనార్టీల కుటుంబాలను ఆదుకున్నారన్నారు. డిగ్రీ చదివితే రూ.25వేలు, పీజీలు చదివితే రూ.లక్షా ఇస్తామని హామీ ఇచ్చి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని విమర్శించారు. అనంతరం దేవరకద్ర నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ఆల ప్రీతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం తప్పా ప్రజలకు కోసం పని చేయాలనే విషయాన్ని మరిచిందని అన్నారు. విభేదాలు పక్కన పెట్టి దేవరకద్రలో మాజీ ఎమ్మెల్యే ఆలను ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో కేసీఆర్‌ను సీఎం చేసేలా అంకితభావంతో పనిచేయాలని కోరారు.
అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియ లో బీఆర్ఎస్ శ్రేణులు చురుగ్గా పాల్గొని ప్రతి ఓటు ను కాపాడుకోవాలని ఆల ప్రీతి పిలుపునిచ్చారు. అంతకంటే ముం దు కొత్తకోటలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలను ఆకట్టుకొన్నారు.కార్యక్రమం లో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీలు పొగాకు విశ్వేశ్వర్, కృష్ణయ్య యాదవ్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేశ్, మాజీ సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు సాక బాలనారాయణ, శ్రావణ్‌కుమార్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ఎరుకలి తిరుపతయ్య, మంజుల రామకృష్ణ యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ చాపల భాస్కర్, అడ్డాకుల ఖాజా మైనోద్దీన్, ఖాజా గోరి, డాక్టర్ సాజిద్ అలీ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

