మహబూబ్నగర్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరుతో ఇబ్బంది పెడుతుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది. ప్రాణాలకు తెగించిన కోట్లాడిన కేసీఆర్ ను బద్నాం చేస్తుందని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని
హితవు పలికారు. మంత్రుల వాటాల పంచాయతీ తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలపై శ్రద్ధ లేదన్నారు. రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీస్తున్నారు. తెలంగాణ సామాజమంతా కేసీఆర్ వెంటే ఉంది. రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.