దామరగిద్ద: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ విద్యలో భాగంగా స్థానిక కేంద్ర ప్రాథమిక పాఠశాల దామరగిద్ద లో కంప్యూటర్ విద్యను MEO కృష్ణారెడ్డి ప్రారంభించారు. అభ్యసన సామర్ధ్యాలను సాధించడంలో వెనుకబడిన విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరమని హెడ్మాస్టర్ అశోక్ తెలియజేశారు చైర్మన్ బర్ల వెంకటమ్మ, గ్రామ పెద్దలు భీమయ్య గౌడ్, ఈదప్ప , గోపాల్ రావు, బసిరెడ్డి, అశోక్ , శ్రీనివాస్ శెట్టి , సత్యనారాయణ విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై విద్యార్థులకు, పాఠశాల అభివృద్ధికి సూచనలు సలహాలు ఇచ్చారు. దీనిలో పాఠశాల ప్రధానోపా ధ్యాయులు చందు గారు ఉపాధ్యాయులు ఉషనప్ప తారాబాయి పాల్గొన్నారు.