రైతు భరోసా సాయంపై మాట మార్చిన ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.
మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు చోట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్లపైకి చేరుకొని బైఠాయించారు.
వీరికి రైతులు మద్దతు పలికారు. వనపర్తి జిల్లా మద్దిగట్లలో రైతులు, కూలీలు పంట పొలంలో నాయకులతో కలిసి వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు ప్రదర్శించి భగ్గుమన్నారు. మక్తల్‌లో నల్ల జెండాలతో గులాబీ నేతలు పాల్గొనగా.. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. స్థానిక నేతలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులుపెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా సాయం ఎకరాకూ రూ.15 వేలు అందిస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రూ.12 వేలు ఇస్తామనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను దగా చేయడం మానుకొని వెంటనే ఇస్తానన్న పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, జనవరి 7
మోసం.. కాంగ్రెస్ నైజం
మక్తల్, జనవరి 7: మోసం కాంగ్రెస్ నైజమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధ్వజమె త్తారు. పాలమూరు ప్రాజెక్టుకు దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి పేరు ఏ విధంగా పెడుతారని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్ర శ్నించారు. రాష్ట్రంలో రైతుబంధు పథకంపై కాం గ్రెస్ మాట మార్చిన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం మక్తల్ పట్టణాధ్యక్షుడు చిన్నహనుమంతు అధ్యక్షతన మక్తల్ తాసీల్దార్ కార్యాల యం ఎదుట చేపట్టిన కార్యక్రమానికి మాజీ ఎ మ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై నల్లబ్యాడ్జీ ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ.. ఎడారిగా ఉన్నటువం టి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు పచ్చటి పంటపొలాలతో కళకళలాడాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తే.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఆ ప్రాజెక్టుకు దివంగత నేత మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెడుతామనడం సిగ్గుచేటన్నారు. కేంద్రమంత్రిగా ఉండి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయకుండా.. తనను అభివృద్ధిని చేసుకున్న జైపాల్‌రెడ్డి పేరును ఏ విధంగా పెడుతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎకరాకు రూ.15 వే లు రైతుభరోసా అందిస్తామని ఆశ చూపి.. అధికారంలోకి వచ్చాక కేవలం రూ.12 వేలే ఇస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హ యాం లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చి అన్నీ కటింగులు పెడుతూ నిర్వీ ర్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. రైతు భరోసా రూ.12వేలు అందిస్తామని ప్రకటనలు చేయడం చూ స్తే వ్యవసాయంపై ఎంత మకువ ఉందో అర్థమవుతుందన్నారు. వానకాలంలో పండించిన ధాన్యాన్ని ప్రభు త్వం కొనుగోలు చే యలేకపోయిందని విమర్శించారు. దీంతో రైతులు కర్ణాటకకు తరలించి అమ్ముకున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ ఉన్న సమయంలో చివరి గింజను సై తం కొనుగోలు చేశామన్నారు. పంట పెట్టుబడి సాయాన్ని రూ.15 వేల కు తగ్గకుండా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతుల సమస్యతు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ తాసీల్దార్ సతీశ్‌కుమార్‌కు వినతిపత్రా న్ని అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నా యకులు శ్రీనివాస్‌గుప్తా, మండలాధ్యక్షుడు మై పాల్‌రెడ్డి, ఆసిరె డ్డి, కౌన్సిలర్లు రాములు, మొగులప్ప, అన్వర్, నాయకులు శంకర్, కుర్మయ్య, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, మహమూద్, సాధి క్, అశోక్‌గౌడ్, ఆనంద్, నర్సింహులు, శివారెడ్డి, సాగర్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.