డ్చర్లటౌన్, ఫిబ్రవరి 23: టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జాతాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం వల్లూర్ గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు బుధవారం జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.