వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామంలో మైసమ్మకుంట చెరువు కట్ట ( Pond Construction) ఆక్రమణకు గురైందని విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుప్పగండ్ల మాజీ ఎంపీటీసీ బాలకిష్టయ్య గౌడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సోమవారం వెల్దండ ప్రజావాణిలో డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 49, 51 లో 12 గంటల భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. చెరువు కట్టను ఆక్రమించి ఫినిషింగ్ చేశారని , వెంటనే సర్వే చేయించి ఆక్రమణకు గురైన భూమిని కుంటకు కేటాయించాలని కోరారు.