నవాబ్‌పేట, అక్టోబర్ 17 : సీతాఫలాల మొక్కలను విరివిగా నాటి భవిష్యత్‌లో సీతాఫలాల దిగుబడి బాగా పెంచాలని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ నీరజ పేర్కొన్నారు. మండలంలోని పోమాల శివారులో రైతు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీతాఫల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిట్ నిర్వాహకులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వైస్ చాన్స్‌లర్ మాట్లాడు తూ.. సీతాఫల్ గుజ్జు తీసేటప్పుడు రంగు మారకుండా చూడాలన్నారు. ఉద్యానవన విశ్వవిద్యాలయం ద్వారా సీతాఫలాల గుజ్జుపై మరిన్ని పరిశోధనలు జరిపి మార్కెటింగ్ పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మారుమూల పోమాలలో సీతాఫల్ యూనిట్‌ను నిర్వహిస్తున్న రైతు డెవలప్మెంట్ సొసైటీని ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధికారులు రాజశేఖర్, సైదయ్య, రైతు డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, రాములు, శ్రీరామ్ ఆంజనేయులు, గజేందర్గౌడ్, రఘునందన్‌రెడ్డి, గణపతి, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.