గద్వాల: గద్వాల సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి ( Theft cases ) పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ ( Accused Arrest ) కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ వై. మొగులయ్య ( DSP Mogulaiah ) వెల్లడించారు. శనివారం గద్వాల సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు
నిందితుల నుంచి 5.5 తులాల బంగారం ఆభరణాలు, రూ.1.20లక్షల నగదు, సెల్ఫోన్లను, , ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేటిదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన కుర్వ చిన్న వెంకన్న, ప్రాణేష్ రాయచూర్‌కు చెందిన గిరీష్, చంద్ర శేఖర్ నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడి గద్వాల రూరల్ ,కేటిదొడ్డి, ధరూర్, మల్దకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇండ్లలో చోరికి పాల్పడేవారని తెలిపారు.
జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు గద్వాల సీఐ టి.శ్రీను, రూరల్ ఎస్సై శ్రీకాంత్, మల్దకల్ ఎస్సై నందీకర్, కేటిదొడ్డి ఎస్సై బి.శ్రీనివాసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పాతనేరస్తులపై నిఘా పెట్టి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. శనివారం మల్దకల్ ఎస్సై నందీకర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారని, వారు పారిపోవడానికి యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు.
వారు ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఇండ్లలో చోరీలకు పాల్పడినట్లు నిందితులు తెలిపినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. చంద్రశేఖర్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలో అతన్ని పట్టుకుంటామన్నారు. ఈ సమావేశంలో గద్వాల్ సీఐ టి.శ్రీను, మల్దకల్ ఎస్సై నందీకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.