మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3 : ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. జీఎస్టీ లైసెన్స్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఓ అధికారి పట్టుబడిన ఘటన చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి ఏసీబీ ఏఎస్పీ కృష్ణగౌడ్ వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పిల్లిగుండు తండా కు చెందిన రాత్లావత్ సంతోష్‌నాయక్ మహబూబ్‌నగర్‌లోని మర్లు ప్రాంతంలో వ్యాపారం కోసం దుకాణం అద్దెకు తీసుకున్నాడు.
వీడీఎన్ ట్రేడర్స్ అనే పేరుతో బిజినెస్ చేసేందుకు జీఎస్టీ లైసెన్స్ కావాలని ఆగస్టు 17న జడ్చర్ల సీఐ ఉస్మాన్‌ను సం ప్రదించి అనంతరం మీ సేవలో అప్లికేషన్ చేశాడు. అదే నెల 22న డిప్యూటీ డీసీటీవో (డిస్ట్రిక్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్) వెంకటేశ్వర్‌రెడ్డి దుకాణం తనిఖీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని, లైసెన్స్ రద్దు చేస్తానని హెచ్చరించారు. దీంతో సదరు వ్యాపారి వీలైతే డబ్బు ముట్టజెబుతానన్నాడు. ఇందుకు రూ.50 వేలు ఇవ్వాలని అధికారి డిమాండ్ చేయగా..రూ.10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
తర్వాత ఏసీబీ అధికారులను సంప్రదించగా వారి పథకం మేరకు.. మంగళవారం న్యూ టౌన్‌లోని కార్యాలయ ప్రాంతంలో నగదు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంకటేశ్వర్‌రెడ్డి నుంచి నగ దు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఆయన చాంబర్లో పలు దస్త్రాలను పరిశీలించారు. అనంతరం హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు. లంచం డిమాం డ్ చేస్తే డయల్ 1064కి సమాచారం ఇవ్వాలని కృష్ణగౌడ్ సూచించారు. దాడుల్లో ఏసీబీ సీఐ జిలానీ, సిబ్బంది ఉన్నారు.
అధికారి ఇంట్లో సోదాలు
గద్వాల అర్బన్, సెప్టెంబర్ 3 : మహబూబ్‌నగర్‌లో లం చం తీసుకుంటూ డీసీటీవో వెం కటేశ్వర్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డా డు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్‌రెడ్డి స్వగ్రామమైన గద్వాల ప ట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నల్లగొండ ఏసీబీ ఎస్సై లు వెంకట్రావు, రామారావు ఆ ధ్వర్యంలో 9 మంది సభ్యులు దాడుల్లో పాల్గొన్నారు. వెంకటేశ్వర్‌రెడ్డి భార్య, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రవీణను విచారించారు. ఆస్తులుగానీ, సంబంధించిన పత్రాలు, నగదు దొరకలేదని కృష్ణగౌడ్ తెలిపారు.